ఏపీలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనిత హాట్ హాట్ గా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్సీ మధవ్ కు చంద్రబాబు విమర్శించే స్థాయి లేదన్నారు. అసలు బీజేపీకి రాష్ట్రంలో ఆ మాత్రం సీట్లు వచ్చాయంటే..అది టీడీపీ పుణ్యమేనన్నారు. టీడీపీపై విమర్శలు చేస్తున్న మధవ్ కు దమ్ముంటే తన పదవికి రాజనామా చేసి టీడీపీ మద్దతు లేకుండా గెలవాలని సవాల్ విసిరారు. మంత్రి వర్గం నుంచి బయటికి వెళ్లడమనేది బీజేపీ వాళ్ల సొంత నిర్ణయమన్నారు.
టీడీపీ సపోర్ట్ వల్లే బీజేపీకి ఆ మాత్రం సీట్లు