దళిత మహిళపై దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న గుంటూరు జిల్లా టీడీపీ బహిష్కృత నేత పి హరిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తెలుగు దేశం పార్టీ నిర్వహించిన దళిత తేజం కార్యక్రమంలో ఓ దళిత మహిళ పట్ల పి హరిబాబు అమానుషంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పార్టీ అతడిపై వేటు వేసింది. ఏకంగా అధికార పార్టీ నిర్వహించిన కార్యక్రమంలోనే పార్టీ కార్యకర్త అయిన దళిత మహిళకు అన్యాయం జరగడం ఏంటంటూ దళిత సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి.
పి హరిబాబుని కేవలం పార్టీ నుంచి తొలగిస్తే చాలదని, అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు హరిబాబుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.