Lokesh Padayatra: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవడంతో పాదయాత్రను నిలిపివేసిన నారా లోకేశ్ తిరిగి నవంబర్ 27 అంటే సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుందని తెలుగుదేశం వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 27 న సోమవారం నుంచి యువగళం యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభం కానుందని రూట్ మ్యాప్ విడుదల చేశారు. 18 రోజులపాటు జరిగే ఈ యాత్రను టీడీపీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో అప్పట్నించి నారా లోకేశ్ తన యాత్రను అదే రోజు పొదలాడలో నిలిపివేశారు. దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి నవంబర్ 27 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని మూడు జిల్లాల్ని కలిపేలా పాదయాత్ర డిజైన్ చేయనున్నారు.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook