టీడీపి నేత అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఆముదాలవలసలో హై టెన్షన్

టీడీపి నేత అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఆముదాలవలసలో హై టెన్షన్

Last Updated : Aug 28, 2019, 04:29 PM IST
టీడీపి నేత అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఆముదాలవలసలో హై టెన్షన్

శ్రీకాకుళం: ఏపీ మాజీ విప్‌, టీడీపి నేత కూన రవికుమార్‌ అరెస్ట్‌కు దాదాపు రంగం సిద్ధమైనట్టే తెలుస్తోంది. ఇటీవల జరిగిన గ్రామవాలంటీర్ల నియామకం విషయంలో  కూన రవికుమార్, ఆయన అనుచరులు తమపై దౌర్జన్యం చేశారని సరుబుజ్జిలి ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూన రవికుమార్‌‌తో పాటు ఆయన అనుచరులు నందివాడ గోవింద రావు, కూన అమ్మినాయుడు, కూన సంజీవిరావు, పల్లి సురేష్‌, గొండెం రవి, తాడేల రవణ, ఎండ రామారావు, గుర్రాల చినబాబు, ఊటపల్లి రామకృష్ణ, అంబాళ్ల రాంబాబు, దాన్న గురువులపై సెక్షన్లు 353, 427, 506, 143, రెడ్‌విత్‌ 149 కింద సరుబుజ్జిలి ఎస్‌ఐ కె.మహాలక్ష్మి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మంగళవారం మధ్యాహ్నం నుంచి కూన రవి కుమార్ అదృశ్యమడంతో ఆయన అరెస్ట్‌ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. 

టీడీపి నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోం: కళా వెంకట్రావు

కూన రవికుమార్ అరెస్ట్‌కి రంగం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో ఆముదాలవలసలో టీడీపీ నేతలు అత్యవసర సమావేశమై ప్రస్తుత పరిస్థితి, అవలంభించాల్సిన వైఖరి విషయమై చర్చిస్తున్నారు. ఇదే విషయమై టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందిస్తూ.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నేత కూన రవికుమార్‌పై కేసు పెట్టడాన్ని టీడీపి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఈ విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించిన కళా వెంకట్రావు.. టీడీపీ నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Trending News