Chandrababu Ready To Allaince: పొత్తులకు సిద్ధమన్న చంద్రబాబు.. జనసేన, బీజేపీకి స్నేహ హస్తం!

Chandrababu Ready To Allaince: ఆంధ్రప్రదేశ్ లో కొత్త పొత్తులు పొడవనున్నాయా? అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు విపక్షాలన్ని ఏకమవుతాయా? అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 04:27 PM IST
    • పొత్తులకు సిద్దమన్న చంద్రబాబు
    • ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటన
    • జగన్ కు వ్యతిరేకంగా అందరూ కలవాలి- బాబు
Chandrababu Ready To Allaince: పొత్తులకు సిద్ధమన్న చంద్రబాబు.. జనసేన, బీజేపీకి స్నేహ హస్తం!

Chandrababu Ready To Allaince: ఆంధ్రప్రదేశ్ లో కొత్త పొత్తులు పొడవనున్నాయా? అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు విపక్షాలన్ని ఏకమవుతాయా? అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ ఆవిర్భావ సభలో.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పొత్తులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దే దింపేందుకు త్యాగాలకు కూడా సిద్దమనే సంకేతమిచ్చారు పవన్ కల్యాణ్. జనసేనాని ప్రకటన తర్వాత పొత్తులపై జోరుగా చర్చ సాగుతోంది. 2014 తరహాలోనే వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన , టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరిగింది. అయితే పొత్తులకు సంబంధించి జనసేన క్లారిటీ ఇచ్చినా.. బీజేపీ మాత్రం స్పందించలేదు.

తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొత్తులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. బాదుడే బాదుడు పేరుతో జిల్లాలు చుట్టేస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా అన్నవరంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. జగన్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే.. పొత్తులపై సంచలన ప్రకటన చేశారు చంద్రబాబు. పొత్తులకు సిద్ధమని ప్రకటించారు. ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా చూస్తామంటూ.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలే చేశారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చారు చంద్రబాబు.

కాకినాడ జిల్లాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో పొత్తులకు టీడీపీ గేట్లు తెరిచిందనే చర్చ సాగుతోంది. జనసేనతో పొత్తుకు టీడీపీ దాదాపుగా సిద్ధమైందని... ఈ దిశగా కేడర్ ను కూడా చంద్రబాబు సిద్ధం చేశారని అంటున్నారు. అయితే బీజేపీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. టీడీపీతో కలిసి పోటీ చేసే విషయంలో బీజేపీ హైమాండ్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని చెబుతున్నారు. అందుకే ఏపీ బీజేపీ నేతలు పొత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయడం లేదని తెలుస్తోంది. టీడీపీ, జనసేన మధ్య మాత్రం పొత్తులకు సంబంధించి చర్చలు అంతర్గతంగా సాగుతున్నాయని అంటున్నారు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో జనసేనతో టీడీపీ పొత్తు దాదాపుగా ఖాయమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

READ ALSO: teenmar mallanna shocking decision: కేసీఆర్‌ను తిట్టనని ఒట్టేసిన తీన్మార్‌ మల్లన్న

CS Somesh Kumar News: సీఎస్ సోమేశ్ కుమార్‌పై చర్యలు ఉన్నట్టా లేనట్టా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News