ఏపీకి మరీ ఈ స్థాయిలో అన్యాయమా ? - కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు అసంతృప్తి

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు లేకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు

Last Updated : Jul 5, 2019, 10:16 PM IST
ఏపీకి  మరీ ఈ స్థాయిలో అన్యాయమా ? - కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు అసంతృప్తి

కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు అసంతప్తి వ్యక్తం చేశారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సభలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని ఆవేదక వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాలకు ఏమాత్రం లేని ఈ బడ్జెట్ తనకు తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు..
ఆర్ధిక లోటు భర్తీపై స్పష్టత లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన తొలి ఏడాది ఆర్థికలోటు భర్తీలో ఇంకా ఇవ్వాల్సిన దానిపై ఏదీ తేల్చలేదు. రాష్ట్ర బడ్జెట్ లో ఆర్ధిక లోటు  రూ.16వేల కోట్ల ఉంటే.. కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మిగిలిన లోటు భర్తీ విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. 
రాజధాని పనలకు కేటాయింపులు శూన్యం
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులకు ఈ బడ్జెట్లో వాటికి కేటాయింపులు చేయకపోవడం గర్హనీయమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక విద్యాసంస్థల విషయానికి వస్తే ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్‌ఆర్‌ తదితర విద్యాసంస్థలకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవం శోచనీయమన్నారు. 
మెట్రో ప్రతిపాదనను పక్కన పెట్టేశారు
విజయవాడ, విశాఖ,  మెట్రో సంబంధించిన ఏపీ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. దీంతో  పాటు కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు తదితర అంశాలకు కేటాయింపులు జరపలేదు. ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించే నిధులను బడ్జెట్‌లో చూపి వాటితో పాటు తీవ్ర ఆర్థికలోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నిధుల అంశం విస్మరించి తమ రాష్ట్రం పట్ల కేంద్ర విపక్ష చూపిందని చంద్రబాబు ఆరోపించారు.

Trending News