రాఘవేంద్ర రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

ప్రముఖ సినీ దర్శకుడు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్ రాఘవేంద్ర రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Last Updated : Aug 27, 2018, 08:47 PM IST
రాఘవేంద్ర రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

ప్రముఖ సినీ దర్శకుడు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్ రాఘవేంద్ర రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆయన వాహన శ్రేణిలోని ఓ వాహనం అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. పోలీసుల కథనం మేరకు.. తిరుమలలో రాఘవేంద్రరావు సోమవారం సాయంత్ర్రం స్కార్పియో వాహనంలో బయలుదేరారు. ఆయన కాన్వాయ్ లోని ఓ వాహన డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా డ్రైవర్ అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టాడని అన్నారు. ప్రమాద సమయంలో రాఘవేంద్రరావు వాహనంలో లేరని.. వెనుక మరో వాహనంలో ఉన్నారని, తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు.

Trending News