Revanth Reddy:తెలంగాణ కాంగ్రెస్ కు వైఎస్సార్ గండం.. సునీల్ సర్వే రిపోర్టుతో రేవంత్ రెడ్డి కలవరం?

Revanth Reddy:వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడు రాజకీయం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కు ఇదో షాకింగ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం హైకమాండ్ డైరెక్షన్ లోనే సర్వే చేస్తున్న సునీల్ టీమ్ ఇచ్చిన నివేదిక టీపీసీసీని పరేషాన్ చేస్తుందని తెలుస్తోంది. సునీల్ ఇచ్చిన నివేదికతో కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. 

Written by - Srisailam | Last Updated : Jul 10, 2022, 09:38 AM IST
  • టీకాంగ్రెస్ లో సునీల్ సర్వే కలకలం
  • వైఎస్సార్ గండం ఉందని రిపోర్ట్
  • సీనియర్లతో రేవంత్ రెడ్డి సమాలోచనలు
Revanth Reddy:తెలంగాణ కాంగ్రెస్ కు వైఎస్సార్ గండం.. సునీల్ సర్వే రిపోర్టుతో రేవంత్ రెడ్డి కలవరం?

Revanth Reddy:వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడు రాజకీయం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కు ఇదో షాకింగ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం హైకమాండ్ డైరెక్షన్ లోనే సర్వే చేస్తున్న సునీల్ టీమ్ ఇచ్చిన నివేదిక టీపీసీసీని పరేషాన్ చేస్తుందని తెలుస్తోంది. సునీల్ ఇచ్చిన నివేదికతో కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఏం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. శనివారం సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ప్రచార కమిటి చైర్మెన్ మదుయాష్కితో మంతనాలు సాగించిన రేవంత్ రెడ్డి.. మరో సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఆదివారం సమాలోచనలు చేయనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీతోనూ సమావేశం కాబోతున్నారు. పీసీసీని అంతగా కలవరపెడుతున్న సునీల్ టీమ్ రిపోర్టులో ఏముంది? రేవంత్ రెడ్డి ఎందుకు అంతగా ఉలిక్కిపడుతున్నారో తెలుసా?

కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో ఒక్కపుడు పీకే టీమ్ లో కీరోల్ పోషించిన సునీల్ తో సర్వే చేయిస్తోంది. సునీల్ టీమ్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి జనం నాడి పట్టింది. ఇటీవలే పీకీ టీమ్ కాంగ్రెస్ పెద్దలకు ప్రాధమిక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలను పరుగులు పెట్టిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కు వైఎస్సార్ గండం ఉందని సునీల్ రిపోర్ట్ ఇచ్చారట. వైఎస్సార్ కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. ఆమె జోరుగా జనంలోకి వెళుతున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. తన యాత్రలో వైఎస్సార్ జపం చేస్తూ వెళుతున్నారు షర్మిల. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గండంగా మారిందని సునీల్ రిపోర్టులో ఉందట. షర్మిల పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో కాంగ్రెస్ నష్టం జరుగుతుందని సునీల్ నివేదిక ఇచ్చారట. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ , ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పడాల్సిన ఓట్లను వైఎస్సార్ టీపీ చీల్చబోతుందని తేల్చిచెప్పారట. వైఎస్సార్ అభిమానులు షర్మిల పార్టీకి మద్దతుగా ఉండే అవకాశం ఉందని సునీల్ రిపోర్ట్ ఇచ్చారని తెలుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వైఎస్సార్ కు తెలంగాణలో బలమైన అనుచరగణం ఉండేది. ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే వైఎస్ కు ఎక్కువ అభిమానులు ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతారు. వైఎస్సార్ అకాల మరణం తర్వాత పలువురు ఆయన అభిమానులు చనిపోయారు. ఏపీలో కంటే తెలంగాణలోనే ఈ మరణాలు ఎక్కువగా జరిగాయి. ఇప్పటికి తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు భారీగానే ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించడం వల్లే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని టాక్. షర్మిల జనంలోకి వెళితే వైఎస్సార్ అభిమానుల ఓట్లు కొన్ని ఆమె పార్టీకి టర్న్ అవుతాయని సునీల్ రిపోర్టులో ఉందని తెలుస్తోంది. షర్మిల తన ప్రసంగాల్లో కేసీఆర్ పాటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. గతంలో వైఎస్సార్ పై రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన వైఎస్ విజయమ్మ కూడా షర్మిల పార్టీ కోసం పని చేస్తానని చెప్పడంతో... వైఎస్సార్ గండం కాంగ్రెస్ పార్టీకి మరింతగా పెరగనుందని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు పీసీసీ నేతలను కలవరపెడుతుందని అంటున్నారు. 

సునీల్ ఇచ్చిన నివేదికపై చర్చించటానికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరుసగా సీనియర్ నేతలను కలుస్తున్నారని అంటున్నారు. వైఎస్సార్ అభిమానుల ఓట్లు చీలకుండా ఉండాలంటే ఏం చేయాలి, షర్మిల పార్టీకి ఎలా చెక్ పెట్టాలి.. వైఎస్సార్ ను పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి  ఓన్ చేసుకోవటానికి పార్టీ పరంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని దానిపై పీసీసీ ముఖ్యనేతలు చర్చిస్తున్నారని తెలుస్తోంది. వైఎస్సార్ కు ప్రధాన అనచరులుగా పని చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో ఈ విషయంపై రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా షర్మిల పార్టీతో మూడు ఉమ్మడి జిల్లాలో గండం ఉందంటూ సునీల్ టీమ్ ఇచ్చిన నివేదిక గాంధీభవన్ లో హాట్ హాట్ గా మారిందని అంటున్నారు. 

Read also: Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!

Read also: KCR VS ETELA RAJENDER:గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ.. బెంగాల్ సీన్ రిపీటయ్యేనా?  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News