Tirupati: తిరుపతిలో షాకింగ్ ఘటన- భూమి నుంచి బయటకు వచ్చిన ట్యాంక్​

చిత్తూరు జిల్లా తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి సిమెంట్ రింగులతో చేసిన ట్యాంక్ ఒక్క సారిగా బయటకు వచ్చింది. ఓ మహిళ ఆ ట్యాంక్​ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 10:25 AM IST
  • తిరుపతిలో వింత ఘటన
  • భూమి నుంచి బయటకు చొచ్చుకొచ్చిన వాటర్​ ట్యాంక్​
  • భారీ వర్షాలే కారణమంటున్న నిపుణులు
Tirupati: తిరుపతిలో షాకింగ్ ఘటన- భూమి నుంచి బయటకు వచ్చిన ట్యాంక్​

Tank has come out of the ground: చిత్తూరు జిల్లా తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి సిమెంట్ రింగులతో చేసిన ట్యాంక్ ఒక్క సారిగా బయటకు వచ్చింది. ఓ మహిళ ఆ ట్యాంక్​ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.

మొత్తం 25 రింగులతో ఈ ట్యాంక్ తయారవగా.. అందులోంచి 18 రింగులు బయటకు చొచ్చుకొచ్చాయి. నగరంలోని శ్రీకృష్ణానగర్‌లో జరిగిన ఈ వింత ఘటనను చూసేందుకు స్థానిక ప్రజలు తరలి వచ్చారు.

కారణాలు ఏమిటి?

ఇటీవల తిరుపతిలో రికార్డు స్థాయిలో వర్షాలు (Heavy rains in AP) కురిశాయి. కుండ పోత వానలకు వాగులు వంకలు అన్ని పొంగిపోర్లుతున్నాయి. అయితే భారీ వర్షాలతో నగరంలో భూగర్భ జలాలు పెరిగినట్లు చెబుతున్నారు నిపుణులు.

భూగర్భ జాలాలు భారీగా పెరిగినప్పుడు.. బోర్లు, బావుల నుంచి నీల్లు బయటకు రావడం చాలా సార్లు చూశాం. అయితే ఇలా ట్యాంక్ బయటకు రావడం మాత్రం ఇదే తొలిసారి.

భూగర్భ జాలాల ఒత్తిడి వల్ల ఈ ట్యాంక్ బయటకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దీని పట్ల ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశార.

Also read: CM Jagan: చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు-అసెంబ్లీ వేదికగా జగన్ కౌంటర్

Also read: TTD : రేపు తిరుమల డిసెంబర్ నెల సర్వదర్శనం టోకెన్ల విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News