Southwest Monsoon Alert: నైరుతి రుతు పవనాలు క్రమంగా ఏపీ , తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. దీనికితోడు దక్షణ తెలంగాణ ప్రాతంంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రానున్న 3-4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోని ఏయే జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూనే బలపడుతున్నాయి. ఫలితంగా ఇక నుంచి ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలకు తోడు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంతో వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మరో రెండ్రోజుల్లో శ్రీకాకుళం వరకూ నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చు. రాయలసీమలో మూడ్రోజుల వరకూ ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి.
ఇక తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, భువనగిరి, నారాయణపేట్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షసూచన జారీ అయింది. ఇక రేపు ఎల్లుండి కూడా అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షసూచన ఉంది.
Also read: Flipkart Smartphone Offers: 12జీబీ ర్యామ్, 108MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook