AP Weather Forecast: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అటు దేశంలో ఇటు ఏపీ, తెలంగాణల్లో కూడా అదే పరిస్థితి. మరోవైపు జూన్ నెలలో కూడా ఎండలు దంచికొట్టాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి శుభవార్త అందుతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది తీవ్ర నిరాశను మిగుల్చుతున్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలు మరోవైపు వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లుతున్నారు. రైతాంగమైతే విత్తుకునేందుకు తొలకరి కోసం ఎదురుచూస్తున్నారు. జూలై నెల వచ్చేసినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే అదే పరిస్థితి. వేడి గాలులు, ఎండ వేడిమి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. దుక్కి దున్నుకుని సిద్ధంగా ఉన్న రైతాంగం విత్తుకునేందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ శుభవార్త విన్పించింది.
ఆంధ్రప్రదేశ్‌కు రానున్న 3 రోజుల్లో గట్టిగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ అంటే ఆదివారం శ్రీ సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, పల్నాడు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, పశ్చిమ గోదావరి , బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. ఈ జిల్లాల్లో సోమ మంగళవారాలు అంటే జూలై 3, 4 తేదీల్లో కుండపోత వర్షాలు పడనున్నాయి.
ఇక కోనసీమతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు అంటే సోమవారం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మాత్రం చెదురు ముదురు జల్లులు పడనున్నాయి. ఇక జూలై 4వ తేదీ అంటే మంగళవారం నాడు ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, సత్యసాయి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు పడవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
Also read: ఏపీ , తెలంగాణల్లో అధికారం ఎవరిది, ఆ సంస్థల తాజా సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook