ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు

Last Updated : Sep 19, 2017, 10:09 AM IST
ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి సోమవారం ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ సంయుక్త కార్యదర్శి ప్రకటన విడదలు చేశారు. ఈ నెల 21 లేదా 22న తేదీల్లో కొత్త  జడ్జీల చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. హైకోర్టులో మొత్తం 61 మంది న్యాయమూర్తుల పోస్టుల ఖరారు కాగా..ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. తాజా నియామకంతో న్యాయూర్తుల సంఖ్య 33కి చేసింది. కాగా వచ్చే నెలలో మరో ఇద్దరు న్యాయమూర్తలు పదవి విరమణ చేస్తున్నారు. కాగా సాధ్యమైనంత త్వరగా న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర న్యాయశాఖ భావిస్తోంది.

కొత్త జడ్జీల జాబితా :

* జస్టిస్ కొంగర విజయలక్ష్మి
* జస్టిస్.పి.కేశవరావు
* జస్టిస్ గంగారావు
* జస్టిస్ సోమయాజులు
* జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి
* జస్టిస్ అమర్ నాథ్‌గౌడ్

 

Trending News