అర్జున అవార్డు గ్రహిత సిక్కిరెడ్డి కెరీర్ హైలెట్స్..

                          

Last Updated : Sep 26, 2018, 11:30 AM IST
అర్జున అవార్డు గ్రహిత సిక్కిరెడ్డి కెరీర్ హైలెట్స్..

బ్యాడ్మింటన్ క్రీడలో గత మూడేళ్లుగా విశేషంగా రాణిస్తున్నతెలుగు అమ్మాయి సిక్కిరెడ్డి ప్రతిభను భారత ప్రభుత్వం గుర్తించింది. ఆమెకు మంగళవారం అర్జున అవార్డుతో సత్కరించింది. మంళగవారం రాష్ట్రపతి భవన్ లో క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా తెలుగు తేజం సిక్కిరెడ్డి ఈ అవార్డు అందుకుంది.  జాతీయ క్రీడలలో మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులకు తగిన గుర్తింపును ఇవ్వడానికి అర్జున అవార్డును భారత ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఈ అవార్డు వెంబడి రూ 5 లక్షల నగదు బహుమతి కూడా అందజేస్తారు. ఈ అవార్డుకు అర్హులు కావడానికి గత 3 సంవత్సరాలుగా మంచి క్రీడా ప్రతిభను కల్గి ఉండటమే కాకుండా మంచి క్రమశిక్షణ కలిగిన నడవడిక కూడా కల్గి ఉండాలి. ఈ అంశాలన్నీ పరిశీలించిన అనంతరం సిక్కిరెడ్డికి భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. 

 కెరీర్ హైలైట్స్....

సిక్కిరెడ్డి తన కెరీర్ లో సింగిల్, డబుల్స్‌లో కలసి నెలకుర్తి సిక్కిరెడ్డి 10 స్వర్ణపతకాలు సొంతం చేసుకుంది. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల డబుల్స్ లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్య పతకం సాధించింది. మిక్స్ డ్ టీ ఈవెంట్ లో స్వర్ణం గెలిచిన జట్టులో సిక్కి సభ్యురాలు కావడం గమనర్హం. ప్రస్తుతం సిక్కిరెడ్డి బ్యాడ్మింటన్‌లో ప్రపంచంలో 27 ర్యాంకు ,  మిక్సిడ్ విభాగంలో 24 ర్యాంక్‌లో కొనసాగుతోంది

* ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2014 ఉమెన్స్ డబుల్స్ విన్నర్, మిక్సిడ్ డబుల్స్ రన్నరప్‌గా నిలిచింది.
* 2013లో ఉమెన్స్ డబుల్స్ రన్నరప్, మిక్స్‌డ్ డబుల్స్‌లో విన్నర్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాదించారు.
* సీనియర్ నేషనల్ గేమ్స్ 2011 ఇండివిడ్యువల్ ఈ వెంట్స్‌లో సిల్వర్ మోడల్ సాధించారు. 
* 2008లో పుణేలో జరిగిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌లో సైనా విజేతగా నిలువగా సిక్కిరెడ్డి రన్నరప్‌గా నిలిచింది.
* 2014 అసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యురాలుగా ఉన్న సిక్కిరెడ్డి ఓవరాల్‌గా 9 అంతర్జాతీయ టైటిల్స్‌ను గెల్చుకుంది. 
* వరల్డ్ ర్యాంకింగ్‌లో 27వ ర్యాంక్
* మిక్స్‌డ్ విభాగంలో 24వ ర్యాంక్

తెలుగుతేజం సిక్కిరెడ్డి నేపథ్యం...
అర్జున అవార్డు గ్రహిత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం. ఆమె తల్లితండ్రులు నెలకుర్తి కృష్ణారెడ్డి- మాధవి. తండ్రి కృష్ణారెడ్డి జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో తండ్రి బాటలో చిన్ననాటి నుంచే నడిచి బ్యాడ్మింటన్ క్రీడను అలవాటు చేసుకుంది. సిక్కిరెడ్డి చిన్నప్పప్పటి నుంచి చదువును ఏమాత్రం నిర్ణక్ష్యం చేయకుండా క్రీడల్లో విశేషంగా రాణిస్తూ వచ్చింది. ఎనిమిదేళ్ల వయస్సులో సిక్కిరెడ్డి ఎల్బీ స్టేడియంలో జరిగిన బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్‌లో చేరడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటి నుంచి వెనుతిరుగకుండా బ్యాడ్మింటన్‌లో రాణించింది. 

Trending News