AP: ఆన్ లైన్ తరగతులపై చర్యలు తప్పవు: విద్యాశాఖ

ఓ వైపు కరోనా మహమ్మారి ( corona pandemic) తో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. విద్యా సంవత్సరం ఇంకా ఖరారు కాలేదు అధికారికంగా. అయినా సరే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు ( Online classes) నిర్వహిస్తూ..ఫీజుల వసూళ్లు మొదలెట్టాయి. ఈ నేపధ్యంలో ఆన్ లైన్ తరగతులకు అనుమతి లేదని...చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది

Last Updated : Jul 6, 2020, 01:53 PM IST
AP: ఆన్ లైన్ తరగతులపై చర్యలు తప్పవు: విద్యాశాఖ

ఓ వైపు కరోనా మహమ్మారి ( corona pandemic) తో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. విద్యా సంవత్సరం ఇంకా ఖరారు కాలేదు అధికారికంగా. అయినా సరే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు ( Online classes) నిర్వహిస్తూ..ఫీజుల వసూళ్లు మొదలెట్టాయి. ఈ నేపధ్యంలో ఆన్ లైన్ తరగతులకు అనుమతి లేదని...చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.

కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus)  కారణంగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యావ్యవస్థ కుదేలైంది. విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు విద్యార్ధులు. కరోనా ప్రభావం 2020-21 విద్యాసంవత్సరంపై ( Academic year 2020-21) పూర్తిగా పడింది. ఈ నేపధ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ తరగతులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నెల రోజుల్నించి ఈ వ్యవస్థ చాలా ప్రాంతాల్లో, చాలా స్కూళ్లలో నడుస్తోంది. కొన్ని విద్యాసంస్థలైతే ఆన్ లైన్ తరగతుల్ని సాకుగా చూపిస్తూ ఫీజుల వసూళ్లు ప్రారంభించేశాయి. ఇంకొన్ని పాఠశాలలైతే ఉపాధ్యాయులకు టార్గెట్ సైతం విధిస్తున్నాయి. ఫీజులు వసూళ్లు చేయకపోతే జీతం కట్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇంకవైపు అడ్మిషన్లు కూడా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న టీచర్లకు గానీ, దిగువ మధ్య తరగతి వర్గాల ప్రజలకు గానీ స్కూల్ మేనేజ్ మెంట్ వ్యవహారం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. Also read: TS high court: ఆన్‌లైన్ క్లాసెస్, ఫీజు వసూళ్లపై మండిపడిన హై కోర్టు

ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ (AP Education Department)  మరోసారి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు హెచ్చరిక జారీ చేసింది. ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై స్పష్టత ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపధ్యంలో ఏపీ విద్యా సంవత్సరం ఇంకా ఖరారు కాలేదని చెప్పింది. విద్యాసంవత్సరమే ఖరారు కానప్పుడు ఆన్ లైన్ తరగతుల ప్రసక్తే లేదని తేల్చింది. అటు అడ్మిషన్లు కూడా చేపట్టడానికి అనుమతి లేదు. విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేవరకూ ఫీజుల వసూళ్లు చేపడితే...సంబంధిత  విద్యార్ధుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికార్లకు ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్ లైన్ తరగతులకు అనుమతి లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి కూడా స్పష్టం చేశారు. Also read: AP: సోలార్ విద్యుత్ సిటీగా విజయవాడ

జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  

Trending News