Sankranthi Effect: సంక్రాంతి ఎఫెక్ట్‌తో విమానాల రద్దీ, టికెట్ ధర 2-3 రెట్లు పెంచేసిన విమానయాన సంస్థలు

Sankranti Effect: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. జనం ఊర్లు దాటుతున్నారు. ప్రయాణ మార్గాలు బిజీగా మారుతున్నాయి. విమాన ప్రయాణానికి రెక్కలొచ్చేశాయి. ధరలు అమాంతం పెరిగిపోయాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2023, 01:45 PM IST
Sankranthi Effect: సంక్రాంతి ఎఫెక్ట్‌తో విమానాల రద్దీ, టికెట్ ధర 2-3 రెట్లు పెంచేసిన విమానయాన సంస్థలు

ఏపీలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. మూడ్రోజుల పెద్ద పండుగకు జనం ఊర్లు దాటుతుంటారు. సెలవులు ప్రారంభం కావడంతో ప్రయాణాలు మొదలయ్యాయి. ఫలితంగా విమాన టికెట్లు భారీగా పెరిగిపోయాయి. 

సంక్రాంతి పురస్కరించుకుని  బస్సులు, రైళ్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. ప్లాట్‌ఫామ్‌పై వచ్చే రైళ్లు, బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. అటు జాతీయ రహదారుల్లో వాహనాల రద్దీ అధికమైంది. టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరి కన్పిస్తున్నాయి. టోల్‌గేట్ల ట్రాఫిక్ జామ్ లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 

బస్సులు , రైళ్లు కిటకిటలాడుతుండటంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయంగా విమాన ప్రయాణంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా విమానయాన సంస్థలు రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ టికెట్ ధరల్ని అమాంతం పెంచేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో విమానయాన సంస్థలు టికెట్ ధరల్ని దాదాపు 3 రెట్లు పెంచాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ విమాన ఛార్జి 10-13 వేలు పలుకుతోంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం టికెట్ 12-14 వేల మధ్య ఉంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి 12-13 వేలు పలుకుతోంది.

హైదరాబాద్ నుంచి అటు కర్నూలు, కడప, తిరుపతి నగరాలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. సెలవుల సమయం కావడంతో తిరుపతికి డిమాండ్ పెరిగిపోయింది. దాంతో తిరుపతి విమాన టికెట్ 2-3 రెట్లు పెరిగిపోయింది. 

Also read: Ap cm Ys jagan: ఉద్యోగులకు శుభవార్త, సంక్రాంతికి పెండింగ్ డీఏ విడుదలకు వైఎస్ జగన్ హామీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News