ఏపీలో ఆర్టీసీ బస్సులు రైట్ రైట్.. కండక్టర్ లేకుండానే!

APSRTC | లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలపాటు బంద్ అయిన ఆర్టీసీ సర్వీసులు ఏపీలో తిరిగి ప్రారంభమయ్యాయి. రోడ్లపైకి జనాలు రావడంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

Last Updated : May 21, 2020, 09:10 AM IST
ఏపీలో ఆర్టీసీ బస్సులు రైట్ రైట్.. కండక్టర్ లేకుండానే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తెలంగాణలో ఇదివరకే ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించగా.. ఏపీలో నేడు (మే 21న) రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఆర్టీసీ రథ చక్రాలు పరుగులు పెడుతున్నాయి. అయితే కండక్టర్ లేకుండానే సర్వీసులు నడుపుతున్నారు.  నేడు బంగారంలా పెరిగిన వెండి ధరలు

విశాఖపట్నం, విజయవాడ నగర సర్వీసులు మినమా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం నుంచే టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్ మొదలైంది. అయితే మొత్తం బస్సుల్లో 17 శాతం బస్సులు (1,683) బస్సు సర్వీసులను మాత్రమే నడపాలని నిర్ణయం తీసుకున్నారు. 65 ఏళ్లు పైబడిన వారితో పాటు 10ఏళ్లలోపు పిల్లలు అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. Photos: 36-24-36తో సెగలు రేపుతోన్న అందం

ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడంతో ఏపీలో మళ్లీ సందడి కనిపిస్తోంది. ప్రస్తుతానికి టికెట్ల మీద ఎలాంటి రాయితీలు వర్తించకపోగా, నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తున్నారు. బస్టాండ్‌లో కరెంట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకునేవారు తమ పేరు, ఫోన్ నెంబర్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News