CM Jagan Speech at Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల విలువైన 340 పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలతో ముందుకు రావడం రాష్ట్రానికి గర్వకారణం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 20 రంగాల్లో దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. శుక్రవారం రూ.11.85 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 92 ఎంఓయూలును కుదుర్చుకోనున్నామన్నారు.
వీటి ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. మిగిలిన 248 ఎంఓయూలు రేపు కార్యరూపం దాల్చనున్నాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందాల విలువ రూ.1.15 లక్షల కోట్లు కాగా.. వీటి ద్వారా దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ –2023లో డెలిగెట్స్‌ను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు.
'రిలయన్స్ గ్రూపు, ఆదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా వారికి ధన్యవాదములు. మిమ్మల్ని అందర్నీ కలుసుకునే ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులందరికీ మేం ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం.
మీరు మాకు చాలా చాలా ముఖ్యమైన వారు. మా రాష్ట్రం బలాలు, మేము కల్పించే విభిన్న అవకాశాలను, వ్యాపార రంగంలో స్నేహపూర్వక వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన పోటీ, ఆవిష్కరణల విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీ భాగస్వామ్యం ద్వారా స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధి సాధించడంపట్ల మేం సంకల్పంతోనే ఉన్నాం..' అని ముఖ్యమంత్రి అన్నారు.
పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ యూనిట్లు, పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్‌టెక్ జోన్, టూరిస్ట్ హాట్‌స్పాట్‌లతో విశాఖపట్నం అత్యంత బలమైన బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు సీఎం జగన్. విశాఖపట్నం కేవలం పారిశ్రామిక రంగంలో బలమైన నగరమే కాకుండా, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిందనని.. ఇక్కడ ఈ సదస్సును నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది మన దేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరం అని.. ఈ ఏడాది సెప్టెంబరులో ఒన్‌ఎర్త్, ఒన్ ఫ్యామిలీ, ఒన్ ఫ్యూచర్ ‘‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ అనే థీమ్‌తో జీ–20 సదస్సును నిర్వహిస్తోందన్నారు. మార్చి చివరివారంలో జరిగే జీ–20 వర్కింగ్ కమిటీ సమావేశాలకు విశాఖ నగరం కూడా ఆతిథ్యం ఇస్తోందని తెలిపారు.
Also read: GIS 2023 Updates: ఏపీలో విద్యుత్ రంగంలో అదానీ, అంబానీల భారీ పెట్టుబడులు
Also read: Bandi Sanjay: కవితమ్మా.. ముందు మీ అయ్యను నిలదీయ్.. వాళ్లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook