Roja: జగన్ ను అన్ ఫాలో చేసేసిన రోజా.. ఆ ఫోటోలన్నీ డిలీట్..పార్టీ మారినట్టేనా..?

Roja unfollow Y.S.Jagan: తాజాగా మాజీ మంత్రి రోజా తన సోషల్ మీడియా ఖాతా నుంచి జగన్ కి  సంబంధించిన ఫోటోలను వైసిపి ఫోటోలను తొలగించడంతో ఈమె వైసిపికి దూరం కానుంది అనే వార్తలు తెరపైకి వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే తమిళ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 27, 2024, 03:28 PM IST
Roja: జగన్ ను అన్ ఫాలో చేసేసిన రోజా.. ఆ ఫోటోలన్నీ డిలీట్..పార్టీ మారినట్టేనా..?

Roja deletes YSRCP photos: ప్రముఖ సీనియర్ హీరోయిన్ రోజా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. కానీ తన పర్ఫామెన్స్ చూపించి మళ్లీ గోల్డెన్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా కలసి నటించిన విషయం తెలిసిందే. 

సినిమాలలో జోరుగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టింది. అలా టిడిపి పార్టీలోకి తొలుత వచ్చిన ఈమె ఆ తర్వాత అక్కడ గెలవలేక టిడిపి లోనే ఉండలేక ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకొని బయటకు వచ్చి వైసీపీలో చేరింది. వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా  గెలిచి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టింది. ఇదిలా ఉండగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న వైసిపి పార్టీ ఈసారి ఓడిపోయింది. పార్టీ ఓడిపోవడంతో రోజాపై రకరకాల విమర్శలు కూడా వెల్లువెత్తాయి. 

అయితే ఇప్పుడు తాజాగా ఈమె పార్టీ మారబోతుందంటూ వార్తలు రాగా అనూహ్యంగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైసీపీ ఫోటోలు, జగన్ అనే పేర్లు బొమ్మలు లేకుండా తొలగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి.  రోజా సోషల్ మీడియాలో హెడర్లో వైసిపి ఆనవాళ్లు లేవు . బయోలో తాను వైసిపి నాయకురాలిని అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అని తెలుస్తోంది.  నగరి ఇన్చార్జిగా రోజా ఉన్నారా లేదా అనేదానిపై కూడా స్పష్టత కావాలి అని ఆమె అడిగినట్లు తెలుస్తోంది. 

మొత్తానికైతే ఈమె మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గుడ్బై చెప్పేసి తమిళనాడు రాజకీయాల్లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట..  తమిళ హీరో విజయ్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం.. టిఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఆ పార్టీ గీతాన్ని విడుదల చేయగా ఇప్పుడు రోజా ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.  దర్శకుడు సెల్వమణి రోజా కూడా తమిళ సినిమాల్లో నటించారు. అందుకే ఇప్పుడు అక్కడ అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం కాస్త వైఎస్ఆర్సిపి లో చర్చనీయాంశంగా మారింది..

Also read: September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News