Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!

Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా  ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్.. బాబును కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదా అసలు తెరవెనక ఏం జరుగుతుందంటే.. ?

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 13, 2024, 12:45 PM IST
Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!

Jr NTR: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమ్ంత్రి చంద్రబాబు నాయుడుతో జూనియర్ ఎన్టీఆర్ భేటి కానున్నట్టు వార్తలు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో సంభవించిన వరదల నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తెలుగు నుంచి బడా స్టార్ హీరోల్లో ముందుగా స్పందించి విరాళం అందించిన కథానాయకుడిగా తారక్ నిలిచారు. తాజాగా ప్రకటించిన రూ. 50 లక్షల చెక్కును స్వయంగా చంద్రబాబు నాయుడును కలిసి ఎన్టీఆర్ ఇవ్వబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. తీరా చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి అనేది అంతా హంబక్ అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కలవడానికి చంద్రబాబు అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదా.. లేకపోతే అపాయింట్ మెంట్ ఇవ్వలేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు  ఎన్టీఆర్ కావాలనే చంద్రబాబును కలిసే ఉద్దేశ్యం లేకనే ఈ మీటింగ్ ను అవాయిడ్ చేసాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబును ఎన్టీఆర్ కలుస్తాడనే వార్త వైరల్ అయింది. తీరా చంద్రబాబు, ఎన్టీఆర్  కలవడం లేదని తెలిసింది.

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చోటా మోటా హీరోలకు కూడా అపాయింట్ మెంట్ ఇచ్చాడు. అలాంటిది ఎన్టీఆర్ కు ఇవ్వకుండా ఉండరు. ఈ రోజు చంద్రబాబు వరదలపై సమీక్షల నేపథ్యంలో బిజీగా ఉండి అపాయింట్ మెంట్ ఇవ్వలేదా అనేది కూడా ఓ పాయింట్. ఒకవేళ తారక్ కలవడానికి వచ్చినపుడు ఓ 10 నిమిషాలు కేటాయించడం పెద్ద విషయేమి కాదు.  ఒకవేళ ఎన్టీఆర్ ను బద్నామ్ చేయాలనే కుట్రలో భాగంగా ఈ వార్తను వైరల్ చేసారా అనేది చూడాలి. ఒకవేళ ఎన్టీఆర్ కలవాలనుకుంటే తర్వాత వచ్చి కలిసిన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. లేకపోతే .. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ పంపించి చేతులు తారక్ దులుపుకుంటాడా అనేది చూడాలి.

అయితే.. ఎన్టీఆర్ తర్వాత వీలు చూసుకొని మరి చంద్రబాబును కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా ఈ నెల 27న ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ‘దేవర’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. ఏపీలో టికెట్ రేట్స్ హైక్ కోసం అన్న ఎన్టీఆర్ చంద్రబాబును కలవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ సినిమాకు ఒక నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఉన్నారు. ఎన్టీఆర్, అన్న కళ్యాణ్ రామ్ కలిసి చంద్రబాబు నాయుడు కలిసి చెక్ అందిస్తారా అనేది చూడాలి.

గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ బ్రదర్స్ కు మామయ్య చంద్రబాబు, బాబాయి బాలయ్యలతో అంటీ ముంటనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత అందరు స్పందించిన తర్వాత తారక్.. చంద్రబాబు గెలుపుపై స్పందించారు. అంతకు ముందు నారా చంద్రబాబు నాయుడు భార్య జూనియర్ మేనత్త అయిన భువనేశ్వరిని నిండు సభలో వైసీపీ నేతలు నానా మాటలన్నారు. దీన్ని ప్రతి ఒక్కరితో పాటు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఖండించారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయమై  మౌనం వహించడంతో అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్.. ఈ సందర్భంగా ఫ్యామిలీకి అండగా ఎందుకు ఓ మాట మాట్లాడకుండా మౌనం వహించారనే దానిపై  పెద్ద ఇష్యూ నడిచింది.  

ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు.. దాన్ని వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా  మార్చడంపై కూడా అప్పట్లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో ఏదో ఒక పార్టీ అనుకూలంగా వ్యవహరించకూడదన్న ఎన్టీఆర్ నిర్ణయం  నం ఈ సందర్భంలో బెడిసి  కొట్టినట్టైంది. ఎన్టీఆర్ గొప్పవారే.. వైయస్ఆర్ గొప్పవారే అంటూ చేసిన కామెంట్స్ టీడీపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. మొత్తంగా చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి అయి.. గత కొన్నేళ్లుగా వీళ్ల మధ్య నడుస్తూన్న మ్యాటర్ కు పులిస్టాప్ పెడతారా లేదా అనేది చూడాలి.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

Trending News