RGUKT CET Result 2020: త్రిబుల్ ఐటీ ఫలితాలు విడుదల..రిజల్ట్ చెక్ చేసుకోవడం ఇలా

RGUKT CET Result 2020: ఏపీ త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.  RGUKT-CET 2020 ఫలితాల్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.

Last Updated : Dec 12, 2020, 01:00 PM IST
  • ఏపీ త్రిబుల్ ఐటీ ఫలితాలు విడుదల
  • రాష్ట్రవ్యాప్తంగా 85 వేల 755 మంది విద్యార్ధుల పరీక్షకు హాజరు
  • ఫలితాల కోసం క్లిక్ చేయాల్సిన వెబ్‌సైట్ http://www.rgukt.in/
RGUKT CET Result 2020: త్రిబుల్ ఐటీ ఫలితాలు విడుదల..రిజల్ట్ చెక్ చేసుకోవడం ఇలా

RGUKT CET Result 2020: ఏపీ త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.  RGUKT-CET 2020 ఫలితాల్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.

రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ( RGUKT-CET ) 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Ap minister Adimulapu suresh ) ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న త్రిబుల్ ఐటీల్లో ( IIIT ) ప్రవేశం కోసం కామన్ ఎంట్రన్స్ పరీక్షను నవంబర్ 28న నిర్వహించారు. ఈ పరీక్షకు 85 వేల 755 మంది హాజరయ్యారు. టాప్ టెన్ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులే ఉండటం విశేషం. పదవ తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించామని మంత్రి తెలిపారు. 

జనవరి 4వ తేదీ నుంచి అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి చెప్పారు. ఇంటర్ అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ ప్రక్రియ ( Online process ) చేపట్టామన్నారు. విద్య..వ్యాపారంగా మారకూడదనే ఆన్ లైన్ విధానం తీసుకొచ్చామన్నారు. మౌళిక వసతుల్లేని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఫలితాలు..ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ కోసం ఈ వెబ్‌సైట్ క్లిక్ చేయండి.. http://www.rgukt.in/

Also read: AP: ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోం..హైకోర్టు హెచ్చరిక

Trending News