ఏపీ ( Ap ) లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ( Coronavirus tests ) రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 77 వేల 28 పరీక్షలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది రాష్ట్ర ప్రభుత్వం. అటు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
కరోనా వైరస్ ( coronavirus ) ప్రారంభం నుంచి ఏపీ ప్రభుత్వం ( Ap Government ) కోవిడ్ 19 పరీక్షలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీని ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గతంలో రోజుకు 10-11 వేల కేసులు వెలుగుచూసేవి. ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య 2-3 వేలకు పడిపోయింది. అటు పరీక్షల సామర్ధ్యాన్ని మాత్రం అంతకంతకూ పెంచుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 77 వేల 28 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2 వేల 949 కేసులు వెలుగు చూశాయి. అంటే పరీక్షలతో పోలిస్తే..కేవలం 3.8 శాతం కేసులు నమోదయ్యాయి.
అటు ఏపీలో ఇప్పటివరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 77 లక్షల 73 వేల 681కి చేరుకుంది. ఇక గత 24 గంటల్లో 3 వేల 609 మంది కోలుకోగా..ఇప్పటివరకూ 7 లక్షల 81 వేల 509 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 వేల 622 మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 18 మంది కరోనా వైరస్ కారణంగా మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య రాష్ట్రంలో 6 వేల 643కు చేరుకుంది.
మొదట్నించి భారీగా పరీక్షలు చేస్తుండటంతో కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో తిరిగి కేసులు పెరుగుతున్న క్రమంలో..ఏపీలో తగ్గుతుండటం ఊరటనిస్తోంది. Also read: AP: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని