కాంగ్రెస్ పార్టీ వీడి, బీజేపీలో చేరిన మాజీ ఎంపీ

కాంగ్రెస్ పార్టీ వీడి, బీజేపీలో చేరిన మాజీ ఎంపీ

Last Updated : Apr 4, 2019, 04:44 PM IST
కాంగ్రెస్ పార్టీ వీడి, బీజేపీలో చేరిన మాజీ ఎంపీ

న్యూఢిల్లీ: గత నెల రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ కేంద్ర మంత్రి జేపి నడ్డా సమక్షంలో బీజేపి కండువా కప్పుకున్నారు. పాత్రికేయ వృత్తిలో చాలాకాలంపాటు కొనసాగిన అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. గతేడాది ఏప్రిల్‌లోనే రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం ముగియగా నెల రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కాగా ఎన్నికల నిర్వహణకు సరిగ్గా మరో వారం రోజులే మిగిలి వుంది. తొలి విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 11న తెలంగాణ, ఏపీలో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా ఆంధ్రాలో శాసన సభ ఎన్నికలు సైతం అదే రోజు పూర్తి కానున్నాయి.

Trending News