Pawan Kalyan-Rana: అదిరిపోయే కాంబినేషన్.. పవన్ మూవీలో రానా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) రాజకీయ ప్రయాణంలో బిజీగా ఉన్నప్పటికీ వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) పవన్ కల్యాణ్ బిజీ బిజీగా ఉన్నారు.

Last Updated : Dec 21, 2020, 01:43 PM IST
Pawan Kalyan-Rana: అదిరిపోయే కాంబినేషన్.. పవన్ మూవీలో రానా

Pawan Kalyan - Rana multi-starrer combination: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) రాజకీయ ప్రయాణంలో బిజీగా ఉన్నప్పటికీ వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) పవన్ కల్యాణ్ బిజీ బిజీగా ఉన్నారు. అయితే తన జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తర్వాత చేయబోయే మరో మూడు చిత్రాలను సైతం ప్రకటించారు. అందులో మొదటిది క్రిష్‌తో ( Director Krish ) కాగా.. రెండోది గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్‌తో ( Director Harish Shankar ), మూడో చిత్రం కిక్, రేసుగుర్రం, సైరా నర్సింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ( Director Surender Reddy ) దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రకటించారు. Also read: KGF Chapter 2: కేజీఎఫ్ 2 బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది

ఆ తరువాత దసరా రోజున Pawan Kalyan 30వ సినిమాకు కూడా కమిట్ అయ్యారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (sitara entertainments) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్. 12గా సాగర్‌ కె.చంద్ర (Sagar Chandra) దర్శకత్వంలో కోలీవుడ్‌లో (మలయాళం) భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యపనమ్ కోషియం’ ( Ayyapanum Koshiyum )  చిత్రాన్ని రీమెక్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించనుండగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. 

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ను సోమవారం అభిమానులతో పంచుకున్నారు మూవీ మేకర్స్. 
‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు బాహుబలి బల్లాల దేవ.. యువ నటుడు రానా ( Rana Daggubati ) ను చిత్ర బృందం ఎంపిక చేసింది. ఈ పాత్ర కోసం ఇప్పటికే సుదీప్‌, విజయ్‌సేతుపతి, రానా పేర్లు వినిపించగా, చివరకు రానా నటించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించడంతో అటు పవన్ అభిమానులు, ఇటు రానా అభిమానులు తెగ సంబరపడుతున్నారు. Also read: 
Sonu Sood: రియల్ హీరోకు గుడి కట్టిన తెలంగాణ ప్రజలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News