హైదరాబాద్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు రూ.20 కోట్ల భూరీ విరాళాన్ని ప్రకటించారు. భారీ విరాళం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 కోట్ల చొప్పున ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. నేరుగా కలిసి ఇవ్వాలని ఉన్నా ప్రస్తుతం లాక్‌డౌన్, సోషల్ డిస్టాన్సింగ్ పలు కారణాలతో ఆన్‌లైన్‌లో ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాన్ని బదిలీ చేయడం గమనార్హం. మిస్ బికినీ ఇండియా విన్నర్ ఫొటో గ్యాలరీ
తెలుగు ప్రజలు కరోనా బారి నుంచి బయటపడి సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి రు.10 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించిన రామోజీ రావుకి తెలంగాణ మంత్రి కేటీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి రు.10 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించిన శ్రీ రామోజీ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏#TelanganaFightsCorona #TelanganaCMRF
— KTR (@KTRTRS) April 1, 2020
ఏపీ సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు
సంక్షోభ సమయంలో ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 కోట్ల విరాళం అందజేసిన రామోజీరావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఆయన రామోజీరావుకు ఓ లేఖ రాశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ