మరో కోణంలో NTR బయోపిక్; 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ డేట్ ఫిక్స్

                                  

Last Updated : Feb 27, 2019, 11:40 AM IST
మరో కోణంలో NTR బయోపిక్; 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్ బయోపిక్ హాట్ టాపిక్ గా మారిన తరుణంలో క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా మహానాయకుడు పేరుతో తెరపైకి తెచ్చారు. ఇందులో ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను పాజిటివ్ యాంగిల్ చూపించేందుకు క్రిష్ ప్రయత్నించారు. పార్టీ బలపడేందుకు ఎన్టీఆర్ కు ఆయన ఏవిదంగా చేదోడు వాదోడుగా ఉన్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఎన్టీఆర్ బమోపిక్ వర్మ డైరెక్షన్ లో  'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో తెరపైకి వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీస్ పార్వతి ఎంట్రీ చూపిస్తూ ఆమెను పాజిటివ్ యాంగిల్ ప్రమోట్ చేస్తున్నారనే విషయం బహిరంగ రహస్యమే..అయితే ఇందుకు చంద్రబాబు పాత్రను నెగిటివ్ యాంగిల్ లో చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

క్రిష్ 'మహానాయకుడు' మూవీకి భిన్నంగా... అసలు జరిగింది ఇది అంటూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై  జనం దృష్టిని ఈ సినిమా వైపుకి మళ్లించారు వర్మ. దాంతో అందరూ విడుదల తేదీపై దృష్టిపెట్టారు. ఈ సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ వర్మ క్యాంప్ నుంచి వినిపిస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందనే అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Trending News