పవన్ కల్యాణ్‌కి మద్దతుగా రామ్‌చరణ్..

పవన్ కల్యాణ్‌కి మద్దతుగా రామ్‌చరణ్.. 

Last Updated : Apr 6, 2019, 11:50 PM IST
పవన్ కల్యాణ్‌కి మద్దతుగా రామ్‌చరణ్..

హైదరాబాద్: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతతో ఎన్నికల ప్రచారానికి దూరమైన నేపథ్యంలో బాబాయ్‌‌‌కు అండగా నిలిచేందుకు అబ్బాయి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రంగంలోకి దిగారు. జనసేన పార్టీకి మద్దతుగా బాబాయ్ పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్న చరణ్... విజయవాడ పయణమయ్యారు. తొలుత బాబాయ్‌ని కలిసి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించిన అనంతరం తర్వాత రెండు రోజుల పాటు బాబాయ్‌‌‌తోపాటే ప్రచారానికి వెళ్లనున్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తోన్న నాగబాబు తరఫున కూడా రామ్‌చరణ్ ప్రచారం చేయనున్నారు. ప్రచారంలో భాగంగా పవన్‌తో కలిసి బహిరంగ సభా వేదికలు పంచుకోనున్న చరణ్ పలు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని తెలుస్తోంది. అదే కానీ జరిగితే చరణ్ ప్రచారం శైలి ఎలా వుంటుంది ? బాబాయ్ కోసం ఓట్లు ఎలా అభ్యర్థిస్తారోననే ఆసక్తి అటు మెగా అభిమానుల్లో ఇటు సాధారణ ఓటర్లలో కనిపిస్తోంది.

Trending News