Rajinikanth About NTR: ఎన్టీఆర్ గురించి రజినీకాంత్ ఏమన్నారో తెలుసా ?

Rajinikanth About NTR: విజయవాడలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని,జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 

Written by - Pavan | Last Updated : Apr 29, 2023, 07:22 AM IST
Rajinikanth About NTR: ఎన్టీఆర్ గురించి రజినీకాంత్ ఏమన్నారో తెలుసా ?

Rajinikanth About NTR: విజయవాడలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తనకు ఆరేడేళ్ల వయసు ఉన్నప్పుడు ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్‌ని తొలిసారిగా చూశా. లవకుశ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎన్టీఆర్‌ను చూశా. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఎన్టీఆర్‌ను చూసి మైమరిచిపోయా. నేను కండక్టర్ అయ్యాకే ఎన్టీఆర్‌ను అనుకరిస్తూ నటించడం మొదలుపెట్టా. ఎన్టీఆర్ ప్రభావం నాపై చాలా ఉండేది. నేను ఎన్టీఆర్ ని అనుకరించడం చూసిన నా సన్నిహిత మిత్రులు నన్ను సినీ రంగంలోకి రావాల్సిందిగా ప్రోత్సహించారు అంటూ రజినీకాంత్ ఆనాటి ఆ విశేషాలను నెమరేసుకున్నారు. 

ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. " ఈనాడు ఇక్కడ ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలనిపిస్తుండగా.. మరోవైపు రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతోంది " అని అంటూ అందరినీ నవ్వించారు. నారా చంద్రబాబు నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. చంద్రబాబు ఘనత దేశ విదేశీ నాయకులకు కూడా తెలుసు. హైదరాబాద్ నగరాన్ని హైటెక్ నగరంగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇటీవల చాలా కాలం తర్వాత హైదరాబాద్‌ను సందర్శించాను. నేను హైదరాబాద్‌లో ఉన్నానా .. లేక న్యూయార్క్‌లో ఉన్నానా అని సందేహం వచ్చింది. 

ఇది కూడా చదవండి : Revanth Reddy Nalgonda Meeting: ఇది నల్గొండ బిడ్డలకే అవమానం.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్

2024లో చంద్రబాబు నాయుడు గెలిస్తే దేశంలో ఏపీ నెంబర్ 1 అవుతుంది అని రజినీకాంత్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుంది. ఎన్టీఆర్ క్రమశిక్షణ పాటించేవారు. దానవీర శూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్‌లా ఉండాలనుకున్నాను. ఎన్టీఆర్ లా మేకప్ వేసుకుని ఫొటో దిగి అలాగే కనిపిస్తున్నానా అని నా స్నేహితుడికి చూపించా. అది చూసిన నా స్నేహితుడు.. నేను కోతిలా ఉన్నానని నా ముఖం మీదే చెప్పాడు. అందుకే నందమూరి తారక రామారావులా కనిపించడం అందరికీ సాధ్యపడదు. అది ఆయనకి మాత్రమే చెల్లింది అంటూ ఎన్టీఆర్ గురించి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తనకున్న జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.

ఇది కూడా చదవండి : Chandrababu Naidu Speech: అందుకే రజినీకాంత్‌ని అతిధిగా ఆహ్వానించాం.. చంద్రబాబు నాయుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News