New coronavirus strain: కరోనా కొత్త వైరస్‌పై సందిగ్దం తొలగింది. దేశవ్యాప్తంగా ఆరు కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించగా..అటు ఏపీలో ఒకే ఒక్క కేసు ఉందని ప్రభుత్వం తెలిపింది.
బ్రిటన్ నుంచి ప్రారంభమైన కరోనా కొత్త స్ట్రెయిన్ ( New coronavirus strain ) ఇండియాలో ఆరుగురికి సోకినట్టు నిర్ధారణైంది. ఈ ఆరుగురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) కు చెందిన మహిళగా గుర్తించారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన మహిళలో ( Rajahmundry women ) మాత్రమే కరోనా కొత్త వైరస్ ఉన్నట్టు నిర్ధారణైందని వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. ఆమె కుమారుడికి మాత్రం నెగెటివ్ వచ్చిందన్నారు.
యూకే ( UK ) నుంచి ఏపీ ( AP ) కు 1423 మంది రాగా..అందులో 1406 మందిని ఇప్పటికే ట్రేస్ చేసి పరీక్షలు నిర్వహించారు. అందుకే 12 మందికి కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. వీరితో కాంటాక్ట్ అయినవారికి కూడా పరీక్షలు చేయగా మరో 12 పాజిటివ్ కేసులు తేలాయి. అయితే కొత్త కరోనా స్ట్రెయిన్ ఉందో లేదో తెలుసుకునేందుకు సీసీఎంబీకు శాంపిల్స్ పంపగా..కేవలం ఒక్కరికే ..రాజమండ్రి మహిళలో మాత్రమే కరోనా కొత్త వైరస్ ఉన్నట్టు తేలింది. మిగిలిన 23 నివేదికలు ఇంకా రావల్సి ఉందని తెలిపారు.
యూకే నుంచి ఇండియాకు వచ్చినవారిలో గుర్తించిన 1406 మందితో కాంటాక్ట్ ఉన్నవారు 6 వేల 364మందిగా అధికారులు గుర్తించారు. ఇప్పటివరకూ రాజమండ్రి మహిళలో మాత్రమే కొత్త వైరస్ స్ట్రెయిన్ ( New coronavirus ) ఉందని నిర్ధారణైంది. మిగిలినవి ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు యూకే నుంచి ఏపీకు వచ్చిన మరో 17 మందిని గుర్తించాల్సి ఉంది.
Also read: New coronavirus strain: యూకే టు ఏపీ రిటర్న్స్ లో ఆ 17 మంది ఎక్కడ