Rain Alert: తెలుగు రాష్ట్రాల వెదర్ అలర్ట్.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు!

Rain Alert: ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల భారీ ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించినట్లు అయ్యింది. తెలంగాణపై ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండడం వల్ల రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 11:19 AM IST
Rain Alert: తెలుగు రాష్ట్రాల వెదర్ అలర్ట్.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు!

Rain Alert: ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా ఉపరితల ద్రోణి ఏర్పడడం వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. 

అయితే ఈ భారీ వర్షాల కారణంగా వాతావరణం చల్లబడినా.. అకాలవర్షాల కారణంగా రైతులకు మాత్రం అపార నష్టం మిగిలింది. చేతి దాకా వచ్చిన పంట.. వర్షంలో తడిపోతుంటే రైతన్న గుండె బరువెక్కుతోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షం కారణంగా పంట దెబ్బతింది. 

ఇరు తెలుగు రాష్ట్రాల మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడం వల్ల.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను వాతావరణ శాఖ విడుదల చేసింది. వర్షం కురిసే సమయంలో రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు.  

Also Read: Nellore: తిరుపతి ఘటన మరవకముందే.. నెల్లూరులోనూ సేమ్ సీన్... బైక్‌పై బాలుడి మృతదేహం తరలింపు...

Also Read: AP 10th Papers Leak: పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వెనుక కారణాలివేనా, నిజమెంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేం

Trending News