బస్సు బోల్తా పడి 33 మందికి గాయాలు

కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.

Last Updated : May 26, 2020, 02:30 PM IST
బస్సు బోల్తా పడి 33 మందికి గాయాలు

శ్రీకాకుళం : కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా పశ్చిమ బెంగాల్‌కి చెందిన వలస కూలీలేనని మందస పోలీసులు గుర్తించారు.

ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు ( Lockdown rules eased ) సడలించడంతో దేశం నలుమూలలా చిక్కుకున్న వలసకూలీలు వారివారి స్వస్థలాలకు తరలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఉన్న వలసకూలీలు పశ్చిమ బెంగాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News