Post Viral On Comedian Hyper Aadi: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సినీ నటులు రాజకీయాలవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రతిసారిలాగానే తమకు ఇష్టమైన నాయకుడికి మద్దతుగా నిలుస్తూ.. స్పీచ్‌లతో అదరగొడుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలం జనసేన సభలో కమెడియన్ హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అసలు మంత్రులకు శాఖలే తెలియవంటూ కామెంట్ చేశాడు. ఏపీ ప్రభుత్వంపైనా గట్టిగానే విమర్శలు చేశాడు. ఆది కామెంట్స్‌కు మంత్రి రోజా కూడా ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీకి భయపడే అలా మాట్లాడుతున్నారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరోవైపు సీఎం జగన్ ఆదేశిస్తే.. పవన్ కళ్యాణ్‌పై కూడా పోటీ చేస్తానంటూ సినీ నటుడు ఆలీ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్‌లో పాలిటిక్స్‌లో సినీ గ్లామర్ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే నెట్టింట ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. 'హైపర్ ఆది రావాలి.. పాలన మారాలి..', '2024లో జనసేన నుంచి కాబోయే మంత్రి హైపర్ ఆది..', 'కాబోయే సినిమాటోగ్రఫీ మంత్రి హైపర్ ఆది' అంటూ ముగ్గురు మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ పోస్టర్స్ వైసీపీ సోషల్ మీడియా యాక్టీవిస్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్టర్లను చూస్తుంటే స్పష్టంగా ఎడిట్ చేసినట్లు కనిపిస్తోందంటూ రిప్లై ఇస్తున్నారు. ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు.
వీర మహిళలు వచ్చేసారు.... ఇక్కడ కూడా ముగ్గురేనా!🤷♀️🤦♀️ pic.twitter.com/Zc8FsKfKRJ
— Anitha Reddy (@Anithareddyatp) January 19, 2023
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది.. తక్కువ టైమ్‌లోనే చాలా ఫేమస్ అయ్యాడు. తన పంచ్‌లతో తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. చిన్న స్క్రీన్‌పై అభిమానులను అలరిస్తునే.. సినిమాల్లోనూ కమెడియన్‌గా యాక్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన హైపర్ ఆది.. జనసేనకు సపోర్ట్ చేస్తూ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడు. గత ఎన్నికల్లోనూ జనసేన తరుఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. కానీ పెద్దగా హైలెట్ అవ్వలేదు.
అయితే రీసెంట్‌గా రణస్థలం యువశక్తి సభలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. హైపర్ ఆది సొంత జిల్లా ప్రకాశం. ఈ జిల్లాలోని గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో ఏదో స్థానం నుంచి టికెట్ కన్ఫార్మ్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆది సొంతూరుకు దగ్గరలో గిద్దలూరు ఉండడంతో అక్కడి నుంచి పోటీ చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఈ వార్తలపై హైపర్ ఆది ఇప్పటి వరకు స్పందించలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎక్కడా కూడా చెప్పలేదు.
Also Read: China Dam: సరిహద్దులో చైనా మాస్టర్ ప్లాన్.. సీక్రెట్‌గా ఆనకట్ట నిర్మాణం
Also Read: Kadapa Road Accident: ఆగి ఉన్న లారీ ఢీకొన్న టెంపో.. ముగ్గురు మహిళలు మృతి, 8 మందికి తీవ్రగాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!
మార్మోగిపోతున్న హైపర్ ఆది పేరు
కాబోయే సినిమాటోగ్రఫీ మంత్రి ఆది అంటూ పోస్టులు
నెట్టింట పోస్టులు వైరల్