Polavaram Project: పోలవరం ప్రాజెక్టు విషయంలో కీలకమైన సమీక్ష నేడు జరగనుంది. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. పోలవరంకు సంబంధించి కీలకాంశాలు సమీక్షలో చర్చకు రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనుల పురోగతిపై కీలకమైన ఉన్నత స్థాయి సమీక్ష ఇవాళ జరగనుంది కేంద్ర జలశక్తి కార్యదర్సి పంకజ్ కుమార్ సమీక్షించనున్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించే ఈ సమీక్షలో రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికార్లతో సమీక్ష జరగనుంది. ఈ సమీక్షలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ( Polavaram project Authority) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ ఛైర్మన్ హెచ్‌కే హల్దార్, డీడీఆర్పీ ఛైర్మన్ ఏబీ పాండ్య ఇతర అధికారులు పాల్గొంటారు.
పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువు 2022 డిసెంబర్‌లోగా పూర్తి చేసే దిశగా పనులు వేగవంతమయ్యాయి. ఈ సీజన్లోనూ. వచ్చే సీజన్లోనూ చేపట్టాల్సిన పనులు, గడువులోగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. రెండోసారి సవరించిన అంచనా వ్యయం 55 వేల 548.87 కోట్లకు అనుమతిచ్చి..నిధులు విడుదల చేయాలని జల వనరుల శాఖ అదికారులు కోరనున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం(Ap goverment) చేసిన ఖర్చులో కేంద్రం చెల్లించాల్సిన 16 వందల కోట్ల రూపాయల్ని తక్షణం చెల్లించాలని విజ్ఞప్తి చేయనున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని సమీక్షలో ప్రతిపాదించనున్నారు.
Also read: Special Trains From Secunderabad: నేటి నుంచి 4 ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభం, వాటి Timings
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook