త్వరలో బుల్లితెరపై పవన్ కళ్యాణ్ షో?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ త్వరలోనే బుల్లితెరపై ప్రత్యక్షం కానున్నారు.

Last Updated : Jul 23, 2018, 05:26 PM IST
త్వరలో బుల్లితెరపై పవన్ కళ్యాణ్ షో?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ త్వరలోనే బుల్లితెరపై ప్రత్యక్షం కానున్నారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘సత్యమేవ జయతే’ తరహాలో ఈ ప్రోగ్రాం ఉండనుందని సమాచారం. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ఆయన మాట్లాడుతారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ ప్రోగ్రాంను వారంలో రెండుసార్లు అరగంట సేపు ప్రసారం చేయనున్నారు. ఈ ప్రోగ్రాం థీమ్, స్క్రిప్ట్ కోసం జనసేన టీం కసరత్తు చేస్తోంది. కొద్ది వారాల్లో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుందని సమాచారం. ఎక్కువ మంది ప్రజలకు తన పార్టీ చేరువయ్యేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పవన్ భావిస్తున్నారు. ఈ ప్రోగ్రాంను తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారం చేస్తారని తెలుస్తోంది.

అయితే సోషల్ మీడియాలో ఈ కార్యక్రమంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పవన్ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ఎక్కువ శాతం రీమేక్ సినిమాలు కాగా.. ఈ షో కూడా రీమేకేనా? అని కొందరు, క్యారియాన్ సార్ అని మరొకొందరు, కనీసం ఈ షో ద్వారా అయినా ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. మరి ఈ షోను పవన్ ఎలా ముందుకు తీసుకువెళ్తారో ఆసక్తికరంగా మారింది.

Trending News