Pawan Kalyan on alliances in 2024 : పొత్తులపై పవన్ కల్యాణ్ ఏం అన్నారంటే..

pawan kalyan on alliances in 2024 :  మరోసారి వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాకుండా చేయటమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నారు పవన్.

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 03:55 PM IST
  • ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాాయ ప్రభుత్వం రావాలి
  • రాష్ట్రంలో అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి
  • పొత్తులపై త్వరలో అద్భుతం జరగొచ్చు- పవన్
Pawan Kalyan on alliances in 2024 : పొత్తులపై పవన్ కల్యాణ్ ఏం అన్నారంటే..

pawan kalyan on alliances in 2024 : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కౌలు రైతు భరోసా యాత్ర నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా సిరివెల్లలో మీడియాతో మాట్లాడారు జనసేనాని. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని వ్యాఖ్యానించారు పవన్. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలంటే... మహిళలకు రక్షణ కావాలంటే ఏపీలో ప్రత్యామ్నయ ప్రభుత్వం రావాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

మద్దతు ధర లేక కౌలు రైతులు నానా అగచాట్లు పడుతుంటే.. వైసీపీ నేతలు వారికి సాయం అందించనివ్వట్లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. రైతులు సాయం పొందాలని వస్తుంటే వారిని అధికారపార్టీ నేతలు బెదిరిస్తున్నారని వాపోయారు. అమ్మా పెట్టదు. అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు.

మరోసారి వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాకుండా చేయటమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నారు పవన్. దేశం అత్యయిక స్థితికి వెళ్లిన సమయంలో అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్‌కు ఎదురొడ్డి జనతా పార్టీ, జనసంఘ్‌ లాంటి పార్టీలు నిలిచాయని గుర్తు చేశారు పవన్. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు పవన్. ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి అవసరమైన విధంగానే జనసేన రాజకీయ విధానాలు ఉంటాయన్నారు.

మోదీ అంటే చాలా గౌరవమని.. బీజేపీతో పొత్తు ఉందన్నారు పవన్. వ్యక్తిగతంగా కూడా తనను బీజేపీ అగ్ర నేతలు అభిమానిస్తారని, రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యనైనా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లగలుగుతున్నానని పవన్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం అధినేత సంప్రదిస్తే పొత్తులపై ఆలోచిస్తామని, ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అంటూనే... రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పొత్తుల పరంగా ఏదో ఒక అద్భుతం జరిగే అవకాశముందని పవన్ అన్నారు.

Also Read - SVP Pre Release Event: ఆ విషయంలో మహేష్‌ బాబుతో పోటీ పడలేకపోయా: కీర్తి సురేష్‌

Also Read - SVP Pre Release Event: ఆ సీన్స్ కోసమే ప్రేక్షకులు మళ్లీమళ్లీ థియేటర్‌కి వస్తారు: మహేశ్‌ బాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News