ఆ లీగల్ నోటీసుకు పవన్ కల్యాణ్ హాట్ రిప్లై

                                                  

Last Updated : Apr 23, 2018, 11:24 PM IST
ఆ లీగల్ నోటీసుకు పవన్ కల్యాణ్ హాట్ రిప్లై

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మీడియా టి9కు చెందిన లాయర్ పంపిన లీగల్ నోటీసుకు పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా న్యాయవాదికి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అభిప్రాయాలపై స్పందించి మీ క్లయింట్ ఇంతగా ఎందుకు స్పందిచారనేది తనకు ఆశ్చర్యానికి గురించేసిందన్నారు. ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వ్యక్తి చేసే ట్వీట్లు అతని ఫీలింగ్స్, అభిప్రాయాలను వెల్లడిస్తాయి. వాస్తవానికి మీ క్లయింట్ పై తను ఎలాంటి నింద మోపలేదని ... తన ట్వీట్లను ఆయన అలా ఊహించుకుని ఉంటారని పవన్ పేర్కొన్నారు.

లీగల్ నోటీసులో మీరు పేర్కొన్నట్లు మీ క్లయింట్ పై తన ఎలాంటి నిరాధాల ఆరోపణలు, నిందలు, వ్యాఖ్యలు లేవు.  ట్విట్టర్ అకౌంట్ ద్వారా నా ఫీలింగ్స్ ను మాత్రమే వెల్లడించాను. నోటీసులో పేర్కొన్నట్లు చట్ట ప్రకారం ఇది ఎవరిపైనా దాడి చేసినట్టు కాదని పవన్ వివరణ ఇచ్చారు. తాన వివరణను దృష్టిలో ఉంచుకుని మీ క్లయింట్ కు సరైన సలహాలు ఇస్తారని భావిస్తున్నానని పేర్కొంటూ రాసిన లేఖను పనవ్ తన ట్విట్టర్ అకౌంట్ లో లో పోస్ట్ చేశారు.

తనపై అస్యత ప్రచారం చేస్తున్నారంటూ ఇటీవలికాలంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు మీడియా సంస్ధలు, ఆయా యాజనాన్యాలపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టి9ను టార్గెట్ చేస్తూ పలు ట్వీట్లు చేశారు. ఆ ఛానల్ ను బహిష్కరించాలని కోరారు. దీనిపై స్పందిన మీడియా యాజమాన్యం పవన్ కల్యాణ్ కు లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో పదన్ కల్యాణ్ ఈ మేరకు స్పందించారు.

Trending News