Pawan Kalyan Meets PM Modi: ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని ఐఎన్ఎస్ చోళలో పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ భేటీ అనంతరం ఐఎన్ఎస్ చోళ బయట పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో భేటీలో చర్చకొచ్చిన అంశాలను మీడియాతో పంచుకున్నారు.
ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రధాని మోదీతో తన భేటీ జరిగిందని చెప్పిన పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్ని అంశాలపై చర్చించాను అని పవన్ కళ్యాణ్ మీడియాకు తెలిపారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసమే, తెలుగు ప్రజలు వర్ధిల్లాలనే కాంక్షతోనే ప్రదానిని కలిసినట్టు చెప్పారు. ప్రధాని కార్యాలయం నుంచి తనకు ముందే పిలుపు వచ్చిందని.. వారి ఆహ్వానం మేరకే ప్రధానిని కలవడం జరిగింది అని తెలిపారు.
2014 తరువాత 8 ఏళ్లకు ఇవాళే మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీని కలిశాను. ఈ 8 ఏళ్ల కాలంలో తాను డిల్లీకి వెళ్ళినప్పటికీ.. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీని కలవలేదు అని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని, బాగుపడాలనే ఉద్దేశంతోనే ప్రధానిని కలిశాను అని పరోక్షంగా ఏపీ సర్కారుపై తన అసంతృప్తిని చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం భవిష్యత్‌లో ఏపీకి మంచి రోజులు వస్తాయని నమ్మకం కలుగుతోందని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ధీమా వ్యక్తంచేశారు.
Also Read : PM Modi Vizag Tour: మోదీ.. మోదీ.. నినాదాలతో మార్మోగిన విశాఖ తీరం.. ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ
Also Read : Modi Visakha Tour: విశాఖలో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన వివరాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook