పవన్ కల్యాణ్ జగన్ బాటలో నడుస్తున్నారు...ఇదేంటని కంగారు పడకండి. ఆదేనండి టీవి ఛానల్ విషయంలో... జగన్ తన పార్టీ ప్రచారం కోసం సొంతంగా సాక్షి మీడియా పెట్టుకున్నట్లే పవన్ కల్యాణ్ కూడా పార్టీ ప్రచారానికి సొంత ఛానల్ ఏర్పాటు చేసుకునే ప్లాన్ లో ఉన్నట్లు టాక్.. అయితే ప్రస్తుతం నడుస్తున్న చానల్స్ లో ఏదోఒకదాన్ని టేకోవర్ చేసుకుంటారా.. లేదంటే కొత్త గా ఛానల్ ప్రారంభిస్తారా అనే విషయంలో క్లారీటీ రాలేదు.
'99 న్యూస్' పై పవన్ కన్ను
ఇప్పటికే ఉన్న '99 న్యూస్' ఛానల్ ను ఆయన టేకోవర్ చేస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి సీపీఐ పార్టీ ఈ ఛానల్ ను ప్రారంభించింది.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఛానల్ కు చెందిన మైక్ పట్టకున్న పవన్.. ఇదేనా మన ఛానల్ అని ప్రశ్నించారు. సమాజానికి మేలు చేసేందుకు..అవినీతిని ఎండగట్టేందుకు ఈ ఛానల్ మనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో పవన్ '99 న్యూస్' టేకోవర్ చేసుకునే ప్లాన్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. ఏమో పవన్ మదిలో ఏముందో ఎవరికి తెలుసు..?