సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు..నోటిఫికేషన్ రిలీజ్ చేసిన APPSC

APPSC: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈనెల 28 నుంచి 30 వరకు 3 రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 10, 2021, 07:09 PM IST
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు
  • నోటిఫికేషన్ రిలీజ్ చేసిన APPSC
  • ఈ నెల 13 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు
సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు..నోటిఫికేషన్ రిలీజ్ చేసిన APPSC

APPSC Notification: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిపార్ట్మెంటల్ పరీక్షల(Departmental Tests)పై కొద్ది రోజులుగా పెద్దఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్‌ పూర్తి కావొస్తుండటంతో శాఖాపరమైన పరీక్షలకు ఏపీపీఎస్సీ(APPSC) సిద్ధమైంది. ఈమేరకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి 30 వరకు 3 రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్  పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ నెల 13 నుంచి దరఖాస్తులు..
ఈనెల 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఓటీపీఆర్‌(OTPR) ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు సూచించింది. ఓటీపీఆర్‌ ద్వారా వచ్చే యూజర్‌ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించినట్టు స్పష్టం చేసింది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని, అందులో 40 మార్కులు వస్తేనే ప్రొబెషనరీకి అర్హులుగా నిర్ధారించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. 

Also Read: AP: జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ

ఏపీలో 2021 అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై రెండేళ్లు పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 1.34 ల‌క్షల మంది ఉద్యోగుల‌కు ప్రోబెషన్ పూర్తి కావటంతో శాఖాపరమైన పరీక్షలను నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News