Pawan Kalyan: పవన్ జనసేన మాత్రమే కాదు.. ఆ పార్టీకి కూడా లోక్ సభ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం..

Pawan Kalyan: తాజాగా 2024లో జరిగిన లోక్ సభ, ఏపీ శాసనసభ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్టైక్ రేట్ సాధించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ మాత్రమే కాదు .. మరో పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 9, 2024, 03:37 PM IST
Pawan Kalyan: పవన్ జనసేన మాత్రమే కాదు.. ఆ పార్టీకి కూడా లోక్ సభ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం..

Pawan Kalyan: 18వ లోక్ సభతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో అన్నింటా విజయం సాధించి జనసేన పార్టీ రికార్డు నెలకొల్పింది. దేశంలో ఓ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా రికార్డులకు ఎక్కింది. అందరు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించే మాట్లాడుతున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో మరో పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఆ పార్టీ గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బిహార్ లో బీజేపీ నేతృత్వంలో ఎన్టీయే కూటమి తరుపున పోటీ నిలిచిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) పోటీ చేసిన 5 లోక్ సభ స్థానాల్లో అన్నింటా విజయం సాధించి రికార్డు నెలకొల్పింది.
 
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) పోటీ చేసిన  జుమూయి, ఖగారియా, హాజిపూర్, సమస్తిపూర్, వైశాలి స్థానాల్లో విజయం సాధించారు. అంతేకాదు 100శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది. ఇక ఆ పార్టీ ఛీప్ చిరాగా పాశ్వాన్.. హాజీపూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తాజాగా ఈ రోజు జరగబోతున్న నరేంద్ర మోదీతో పాటు ఈయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన పార్టీలో మరో ఎంపీ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  

ఈ ఎన్నికల్లో ఏపీ 2 ఎంపీ స్థానాలు గెలిచిన జనసేన పార్టీ కేంద్ర మంత్రి వర్గంలో చేరడం లేదు. మరి ఏపీలో చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరుతారా అనేది చూడాలి. ఏది ఏమైనా దేశంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రమే కాదు.. బిహార్ లోని లోక్ జనశక్తి (రామ్ విలాస్ పాశ్వాన్) పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీలుగా రికార్డులకు ఎక్కారు.

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News