AP: ఆ అధికారి విచారణలో నాట్ బి ఫోర్ మి

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఘా పరికరాల కొనుగోలుకేసులో సస్పెండైన ఈ కేసు విచారణలో ఇప్పుడు నాట్ బిఫోర్ మి అంశం తెరపైకొచ్చింది.

Last Updated : Nov 3, 2020, 06:57 PM IST
AP: ఆ అధికారి విచారణలో నాట్ బి ఫోర్ మి

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ( Intelligence chief A B Venkateswara rao ) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఘా పరికరాల కొనుగోలుకేసులో సస్పెండైన ఈ కేసు విచారణలో ఇప్పుడు నాట్ బిఫోర్ మి అంశం తెరపైకొచ్చింది.

నాట్ బిఫోర్ మి ( Not before me ) . ఇటీవలికాలంలో ప్రాచుర్యమైన జ్యుడీషియల్ వర్డ్ ఇది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో  ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం ( Ap Government ) సస్పెండ్ చేసింది. అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో..హైకోర్టు ( High court ) సస్పెన్షన్ ఉత్తర్వుల్ని కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది. దాంతో హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ..ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme court ) ను ఆశ్రయించింది. ఈ కేసులో ఇప్పుడు కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ చేస్తున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆయన నాట్ బిఫోర్ మి అని అన్నారు. వ్యక్తిగత కారణాలతో కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. తాజా పరిణామంతో శీతాకాలం సెలవుల తర్వాతే ఈ కేసు మరో ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

ద్రోన్ల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయనేది ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న ప్రధాన ఆరోపణ. సస్పెండ్‌ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌)కు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. 

Trending News