Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్... రూ.120కోట్ల జరిమానా విధింపు..

NGT: జాతీయ హరిత ట్రిబ్యునల్...ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి మరీ ప్రాజెక్టులు నిర్మించారంటూ..రాష్ట్రప్రభుత్వానికి రూ. 120 కోట్లు ఫైన్ వేసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 06:50 PM IST
  • ప్రాజెక్టుల్లో పర్యావరణ అనుమతులు ఉల్లంఘన
  • ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్
  • పోలవరంతో సహా మరో 3 ప్రాజెక్టులకు భారీగా జరిమానా విధింపు
Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్... రూ.120కోట్ల జరిమానా విధింపు..

NGT Fine for AP Government: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ గట్టి షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు(Polavarm Project) నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా(Fine) విధించింది. రాష్ట్ర ప్రభుత్వాని(AP Goverment)కి రూ.120కోట్ల ఫైన్  వేసింది. 

పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో 3 ప్రాజెక్టులకు కూడా ఇదే విధంగా జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు(Purushottapatnam project)కు సంబంధించి రూ.24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టు(Pattiseema Project)కు సంబంధించి రూ.24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. ఫైన్ ను 3 నెలల్లో చెల్లించాలని రాష్ట్రానికి ఎన్జీటీ(National Green Tribunal) ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి జరిమానా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. 

Also Read: Jawad Cyclone: బంగాళాఖాతంలో రేపు తుపానుగా మారనున్న వాయుగుండం

జరిమానా నిధుల వినియోగంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.  పర్యావరణ అనుమతుల ఉల్లంఘనల(Violation of environmental permits)పై గతంలో ఎన్జీటీకి ఫిర్యాదులు అందాయి. గతంలో పెంటపాటి పుల్లారావు, వట్టి వసంతకుమార్‌ ఎన్జీటీకి కంప్లెయింట్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News