పేలిన సెల్ ఫోన్.. యువతికి గాయాలు !

పేలిన సెల్ ఫోన్.. యువతికి గాయాలు

Last Updated : Mar 10, 2019, 12:59 PM IST
పేలిన సెల్ ఫోన్.. యువతికి గాయాలు !

చిత్తూరు: తరచుగా సెల్ ఫోన్స్ పేలుతున్న ఘటనలు వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం మండలం చందం గ్రామంలో సెల్‌ఫోన్ పేలిన ఘటనలో శ్రీదేవి(20) అనే యువతికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీదేవి ఆదివారం తెల్లవారుజామున తన సెల్‌ఫోన్‌ను చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగానే ఒకేసారి పెద్ద శబ్ధంతో పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి శ్రీదేవి ముఖానికి, చెవులు, చేతులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. 

గాయాలపాలైన శ్రీదేవిని వెంటనే ఆమె కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే వున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది.

Trending News