MLA Roja: ఎమ్మెల్యే రోజా కీలక నిర్ణయం.. జబర్దస్త్‌కు గుడ్‌బై.. ఇకపై ఏ షూటింగ్స్‌ చేయనని క్లారిటీ..

MLA Roja Key Decision: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి చేపట్టనున్న నేపథ్యంలో టీవీ షోలు, సినిమాలకు గుడ్‌బై చెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2022, 10:40 AM IST
  • ఏపీ కొత్త కేబినెట్‌లో రోజాకు చోటు
  • నెరవేరిన ఆర్కే రోజా కల
  • ఇకపై టీవీ షోలు, సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటన
MLA Roja: ఎమ్మెల్యే రోజా కీలక నిర్ణయం.. జబర్దస్త్‌కు గుడ్‌బై.. ఇకపై ఏ షూటింగ్స్‌ చేయనని క్లారిటీ..

MLA Roja Key Decision: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి చేపట్టనున్న నేపథ్యంలో ఇకపై టీవీ షోలు, సినిమాలకు దూరంగా ఉంటానని తెలిపారు. ఇకనుంచి ఏ షూటింగ్స్‌లోనూ పాల్గొనని స్పష్టం చేశారు. దీంతో జబర్దస్త్ సహా తన సినీ కెరీర్‌కు రోజా ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి కాసేపటి ముందు రోజా ఈ ప్రకటన చేశారు.

మంత్రి వర్గంలో స్థానం కల్పించడం ద్వారా సీఎం జగన్ తనకిచ్చిన గుర్తింపును ఎప్పటికీ మర్చిపోలేనని రోజా పేర్కొన్నారు. ఒకప్పుడు తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు సవాల్ చేశారని... కానీ అదే అసెంబ్లీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా ఉండబోతున్నానని చెప్పారు. సీఎం జగన్ వల్లే తనకు ఈ అవకాశం దక్కిందన్నారు. జగన్ కేబినెట్‌లో మహిళా మంత్రిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని... సీఎం సూచనల మేరకు పనిచేస్తానని చెప్పారు. తన ప్రాణం ఉన్నంతవరకు జగన్ కోసం పనిచేస్తానని అన్నారు. ఒకప్పుడు రోజా అంటే ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారని.. కానీ ఇవాళ జగన్ తనను మంత్రిని చేశారని ఆనందం వ్యక్తం చేశారు.

మంత్రి పదవిపై రోజా చాలా ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. నిజానికి జగన్ మొదటి కేబినెట్‌లోనే రోజా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలతో ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో అప్పట్లో మంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా ఆమె దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజాను బుజ్జగించేందుకు మంత్రి పదవికి బదులు ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (ఏపీఐఐసీ) పదవిని సీఎం ఆమెకు కట్టబెట్టారు. గత కేబినెట్‌లో చోటు దక్కని రోజాకు ఈసారి మాత్రం బెర్త్ ఖరారైంది. చిత్తూరు జిల్లా నుంచి మొత్తం ముగ్గురికి మంత్రి పదవులు వరించాయి. పాత కేబినెట్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిలను కొనసాగిస్తూనే కొత్తగా రోజాకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. 

Also Read: Thippeswamy: చివరి నిమిషంలో 'తిప్పేస్వామి'కి చేజారిన పదవి.. బావమరిదికే మళ్లీ ఛాన్స్.

Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook  

Trending News