Nara Lokesh: నేను ఈ వ్యక్తికి పెద్ద అభిమానిని.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన నారా లోకేష్.. అందులో ఏముందంటే..?

Minister nara Lokesh: ఏపీ మంత్రి నారాలోకేష్ తాజాగా, ఒక ఆసక్తికర వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం తొలుత షాక్ అవుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 28, 2024, 04:04 PM IST
  • క్రిస్మస్ వేడుకల్లో అనుకొని అతిథి..
  • అతగాడి టాలెంట్ కు ఫిదా అవుతున్న జనాలు
Nara Lokesh: నేను ఈ వ్యక్తికి పెద్ద అభిమానిని.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన నారా లోకేష్.. అందులో ఏముందంటే..?

Minister nara Lokesh post video goes viral: సాధారణంగా చాలా మంది ఫెమస్ నాయకులు, సెలబ్రీటీలను ఫాలో అవుతుంటారు. వారు మాట్లాడే విధానం, హవా భావాలను గమనిస్తుంటారు. వారిలా డ్రెస్సింగ్, లుక్కింగ్ ఉండేలా ప్లాన్ లు చేసుకుంటారు. అచ్చం వారి గొంతు వచ్చేవిధంగా మిమిక్రీ కూడా చేస్తుంటారు. అయితే.. కొన్నిసందర్బాలో వీరు అచ్చం.. నిజమైన వారిలో కూడా కన్పిస్తుంటారు.

 

ప్రస్తుతం ఏపీ మంత్రి నారాలోకేష్ తాజాగా, తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. దానిలో ఒక వ్యక్తి అచ్చం చంద్రబాబు నాయుడు మాదిరిగా కన్పిస్తున్నారు. ఆయన మాట్లాడటం, ప్రజల్ని పలకరించడం, విక్టరీ సింబల్ చూపించడం.. అక్కడున్న ప్రతి ఒక్కర్ని ప్రేమతో పలకరించడం ప్రస్తుతం వైరల్ గా మారింది. క్రిస్మస్ వేడుకల్లో.. ఒక వ్యక్తి అచ్చం... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిరిగా డ్రెస్సింగ్ వేసుకుని.. ఆయనకు మల్లే ప్రజల్ని పలకరిస్తు హల్ చల్ చేశారు.

అక్కడున్న వారంతా.. కేసేపు నిజంగా సీఎంగారు వచ్చారా.. అని షాక్ కు గురయ్యారంట. ఈ వీడియో వైరల్ కావడంతో అది కాస్త మంత్రి నారాలోకేష్ కంటపడినట్లు తెలుస్తొంది. దీంతో ఆయన ఈ వీడియోలోని వ్యక్తి టాలెంట్ కు ఫిదా అయ్యానని కూడా చెప్పారంట. అతనికి తాను.. పెద్ద అభిమానిని అంటూ చెబుతూ.. తన ఎక్స్ ఖాతాలో అభిమాని టాలెంట్ ఉన్న వీడియోను షేర్ చేశారు.

Read more: Chandrababu Naidu: ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. వారికి పెట్రోల్, డీజీల్‌పై 50 శాతం రాయితీ..!.. డిటెయిల్స్ ఇవే..

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంత మొదటగా ఏపీ ముఖ్యమంత్రిగారు అని భ్రమ పడుతున్నారంట. ఆ తర్వాత మెల్లగా వామ్మో.. భలే బురిడి కొట్టించాడే.. అంటూ కామెంట్లు చేస్తున్నారంట. మొత్తానికి ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News