Michaung Cyclone Impact: మిచౌంగ్ తుపాను ప్రభావం, మూతపడ్డ విమానాశ్రయాలు

Michaung Cyclone Impact: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ఏపీ, తమిళనాడుపై విరుచుకుపడుతోంది. భారీ వర్షాలతో చెన్నై సహా ఏపీలోని అన్ని జిల్లాలు అతలాకుతలమౌతున్నాయి. ముఖ్యంగా విమానాశ్రయాలపై పెను ప్రభావం పడుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2023, 11:23 AM IST
Michaung Cyclone Impact: మిచౌంగ్ తుపాను ప్రభావం, మూతపడ్డ విమానాశ్రయాలు

Michaung Cyclone Impact: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తాతీరం వెంబడి జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తమిళనాడు చెన్నైలో నిన్నటి నుంచే పరిస్థితి దయనీయంగా మారింది. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇవాళ మద్యాహ్నం బాపట్ల వద్ద తీరం దాటనుంది. ప్రస్తుతం నెల్లూరుకు 70 కిలోమీటర్లు, చెన్నైకు 160, మచిలీపట్నానికి 70 , బాపట్లకు 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను కారణంగా తమిళనాడులోని చెన్నై సహా పొరుగున్న ఉన్న 3 జిల్లాల్లో నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో చెన్నైలో 35 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమైదైంది. ఫలితంగా చెన్నైలో పరిస్థితి తీవ్రంగా మారింది. రోడ్లు, రహదారులు జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్లలో నీరు చేరింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చెరువుగా మారిపోయింది. ఫలితంగా 160 విమానాలు రద్దయ్యాయి. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేశారు. 

ఇక మిచౌంగ్ తుపాను ప్రభావం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ రాకపోకలపై పడింది. విశాఖ నుంచి వెళ్లే 23 ఇండిగో విమానాలు రద్దు చేసినట్టు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. విమానాశ్రయాన్ని మూసివేయలేదని కొన్ని విమానాలు మాత్రం రద్దయ్యాయయని తెలిపారు. అత్యవసర సర్వీసులు, విమానాల మళ్లింపు కోసం ఎయిర్‌పోర్ట్ పనిచేస్తోందన్నారు. 

మిచౌంగ్ తుపాను కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో కూడా నీరు చేరడంతో ఎయిర్‌పోర్ట్ మూసివేశారు. విజయవాడ విమానాశ్రయంపై కూడా తుపాను ప్రభావం కన్పిస్తోంది. 14 విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయం దాదాపుగా మూతపడింది. అత్యవసర సర్వీసులు మాత్రమే కొనసాగుతున్నాయి. 

మిచౌంగ్ తుపాను కారణంగా ఇప్పటికే ఏపీలో 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. రానున్న 24-48 గంటల వరకూ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మిచౌంగ్ తుపాను కారణంగా ఇప్పటికే విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై-విజయవాడ మార్గంలో అయితే చాలా రైళ్లు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

Also read: Michaung Cyclone Alert: ఏపీలో మిచౌంగ్ తుపాను బీభత్సం, జిల్లాల్లో రెడ్, ఆరెంజ్, ఎలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News