HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..

HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 2, 2024, 10:49 AM IST
HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..

HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అన్నకు తగ్గ తమ్ముడుగా రాణించారు. అంతేకాదు ఏ సినీ ఇండస్ట్రీలో కూడా అన్నదమ్ములు ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్లు చాలా అరుదు అని చెప్పాలి. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తమ్ముడిగా పవర్ స్టార్ గా రాణించారు. అంతేకాదు అన్న మాదిరిగానే రాజకీయాల్లో ప్రవేశించారు. అన్నయ్య చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినట్టుగానే.. పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టారు. అన్నయ్య చిరులా మధ్యలో కాడి ఒదిలేయకుండా.. జనసేన పార్టీని నిలబెట్టారు. అంతేకాదు గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేలా కూటమి ఏర్పాటు చేసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీ రోల్ పోషించారు.  

ఆ సంగతి పక్కన పెడితే.. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కు అన్నయ్య చిరంజీవి ప్రత్యేకంగా త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసారు. పవన్ కళ్యాణ్.. చిరు దంపతులు ఉన్న ఈ  ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి యేడాది నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కావాల్సిన సమయంలో , కావాల్సిన నాయకుడు వాళ్లు జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి బిడ్డగా పవన్ కళ్యాణ్ వచ్చాడంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

అంతేకాదు రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్దత కలిగిన ఒక నాయకుడిగా నిన్న వాళ్ల జీవితాల్లో ఆహ్వానించారు. వాళ్ల గుండెల్లో వాళ్లకు చోటు ఇచ్చారు. ఈ రోజుల్లో నీలాంటి నిజాయితి పరుడైన నాయకుడు కావాలి. రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు. చేస్తాననే నమ్మకంతో నాతో పాటు ఆంధ్ర ప్రదేశ్  ప్రజలందరికీ ఉంది అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ .. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు.

పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికల నుంచి  రాజకీయాల్లో ఉన్నారు. 2014లో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు కుదుర్చుకొని ఎలక్షన్ కంటెస్టెంట్ చేసి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలతో జనసేన పొత్తు కుదిరేలా చేసి పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన రాజకీయ పార్టీగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News