నాగబాబుకి మద్దతుగా మెగా హీరోలా ప్రచారం !!

జనసేన పార్టీ తరఫున నరసాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న నాగబాబుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు మెగా హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

Last Updated : Apr 4, 2019, 08:59 PM IST
నాగబాబుకి మద్దతుగా మెగా హీరోలా ప్రచారం !!

జనసేన పార్టీ తరఫున నరసాపురం లోక్ సభ అభ్యర్ధిగా బరిలోకి దిగుతన్న నాగబాబుకు మద్దతుగా మెగా ఫ్యామిలీ  ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చింది. మెగా హీరోలైన అల్లు అర్జన్, వరుణ్ తేజ్ ప్రచారం చేసేందుకు వస్తున్నారు. ఈ విషయాన్ని నాగబాబు భార్య పద్మజ తెలిపారు. ఇప్పటికే ఆయన తరుపున ఆయన కూతురు నటి నిహారిక ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఇప్పడు బన్నీ, వరుణ్ ఎంట్రీతో మరింత గ్రాఫ్ పెంచుకోవాలని నాగ బాబు భావిస్తున్నారు. మరి మెగా హీరోలా ప్రచారం ఏ మేరకు లాభిస్తుందనే చూడాల్సి ఉంది. 

అల్లు అర్జన్, వరుణ్ తేజ్ ప్రచారానికి వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్  ప్రచారానికి దూరంగా ఉంటం చర్చనీయశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి జపాన్ పర్యటనకు వెళ్లగా.. చెర్రీ షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ లేకుండా ఆయన సోదరుడిని అభిమానులు ఏ మేరకు ఆదరిస్తారనే దాని చర్చనీయశంగా మారింది.

Trending News