ఏపీ వైద్యారోగ్య శాఖలో కొత్తగా 2,190 పోస్టులు.. జగన్ సర్కారు ఉత్తర్వులు..

రాష్ట్రంలో వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పెద్దమొత్తంలో వైద్య ఆరోగ్య శాఖలో అదనంగా కొత్తపోస్టులు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 09:42 AM IST
ఏపీ వైద్యారోగ్య శాఖలో కొత్తగా 2,190 పోస్టులు.. జగన్ సర్కారు ఉత్తర్వులు..

Andhra Pradesh: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ(Medical and Health Department Posts)కి ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి సీఎం జగన్(CM Jagan) సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్‌లో 560 గ్రేడ్-2 ఫార్మసిస్ట్‌లతో పాటు వైద్యకళాశాలలో 1952 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 1285 ఉద్యోగాల అదనంగా మంజూరు చేసింది.

Also Read: Ship Repairing Unit: ఏపీలో త్వరలో షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు

35 మెడికల్ కళాశాలలు(Medical Colleges), అనుబంధ ఆసుపత్రులలో 2190 కొత్త పోస్టులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు కొత్తగా సృష్టించిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా మంజూరైన పోస్టుల వివరాలు చూస్తే.. ప్రొఫెసర్లు- 51, అసోసియేట్ ప్రొఫెసర్లు-187, అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 130, నర్సింగ్ -1040, పారామెడికల్ -782 ఉన్నాయి. కొత్తగా మంజూరైన పోస్టుల కారణంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెరగనున్నాయి. ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News