Bay of Bengal: బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక జారీ

Bay of Bengal: అటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు దంచెత్తుతుండగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 10, 2021, 01:50 PM IST
  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని ఐఎండీ హెచ్చరిక
  • రానున్న మూడ్రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తెలంగాణల్లో భారీ వర్షాలు
  • ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అప్రమత్తమైన తమిళనాడు యంత్రాంగం
Bay of Bengal: బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక జారీ

Bay of Bengal: అటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు దంచెత్తుతుండగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మూడు రోజులపాటు వర్షాలు నమోదు కానున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల (Heavy Rains)హెచ్చరిక నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీరప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే నాలుగు రోజుల్నించి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తమిళనాడుకు (Tamilnadu)వాయుగుండం ప్రభావం తోడైతే పరిస్థితి మరింత దయనీయం కానుంది. భారీ వర్షాలు మరో మూడ్రోజులపాటు కురవనుండటంతో తమిళనాడు అధికార యంత్రాగం అప్రమత్తమైంది. 

Also read: AP CM YS JAGAN: బ్రేకింగ్ న్యూస్, ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్, ఇక నిత్యం ప్రజల్లోనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News