జగన్ సీఎం అవడం ... చంద్రబాబు రిటైర్‌మెంట్ ఖాయమంటున్న కేటీఆర్

ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ మరోమారు స్పందించారు

Last Updated : Apr 5, 2019, 09:26 AM IST
జగన్ సీఎం అవడం ... చంద్రబాబు రిటైర్‌మెంట్ ఖాయమంటున్న కేటీఆర్

ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ మరోమారు స్పందించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో జాతీయ పార్టీల్లోని ఏ ఒక్క పార్టీకి పూర్తి రాదని...ప్రాంతీయ ఫార్టీలు కలసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడతాయన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలను ప్రస్తావిస్తూ ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఎవరి ఎన్నిసీట్లు వస్తాయో తాను కచ్చితంగా చెప్పలేను కానీ..ఈ సారి మాత్రం చంద్రబాబు ఓటమి ఖాయమని.. ఎన్నికల తర్వాత ఆయన రిటైర్డ్ మెంట్ తీసుకోకతప్పదని జోస్యం చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని..ఏపీకి జగన్ సీఎం అవుతారనికేటీఆర్ పేర్కొన్నారు

రేవంత్ పై సెటైర్లు ...
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పోటీ అంశాన్ని ప్రస్తావిస్తూ మల్కాజ్‌గిరికి ఆయన  ఏమైనా లోకలా? అంటూ ప్రశ్నించారు . సొంత ఇలాఖా కొండగల్ లోనే దారుణంగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి ..మల్కాజ్‌గిరిలో ఏదో అద్భుతం చేస్తారనుకుంటే  పొరపాటే అవుతుందన్నారు.

రేణుకపై విమర్శలు...

 రేణుక అభ్యర్ధిత్వంపై కేటీఆర్ మాట్లాడుతూ ఖమ్మంలో అభ్యర్ధుల దొరక్కపోవడంతో రేణుకను రంగంలో దించారని ఎద్దేవ చేశారు. ఖమ్మం నుంచి బరిలోకి దించేందుకు అభ్యర్ధుల లేక  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నామా నాగేశ్వరరావు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కాంగ్రెస్... చివరకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రేణుకా చౌదరి పేరును జాబితాలో చేర్చిందని కేటీఆర్ ఎద్దేవ చేశారు

Trending News